Saturday, December 4, 2021
Homeతెలుగు NewsసినిమాRashi Khanna: బాయ్ ఫ్రెండ్ విషయమై రాశీ ఖన్నా ఓపెన్.. అలా బతికేస్తున్నా అంటూ అన్నీ...

Rashi Khanna: బాయ్ ఫ్రెండ్ విషయమై రాశీ ఖన్నా ఓపెన్.. అలా బతికేస్తున్నా అంటూ అన్నీ చెప్పేసిన స్టార్ హీరోయిన్ – heroine rashi khanna says about her personal things in latest chit chat


ప్రధానాంశాలు:

  • ఫుల్ ఫామ్‌లో రాశీ ఖన్నా
  • సోషల్ మీడియాలో హీరోయిన్ హవా
  • పర్సనల్ విషయాలపై ఓపెన్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఓ ఇమేజ్ కూడగట్టుకున్న నటీనటులపై, వారి వారి వ్యక్తిగత విషయాలపై ప్రేక్షకుల కన్ను ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల డేటింగ్, ప్రేమ వ్యవహారాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇక సోషల్ మీడియా ప్రతి ఒక్కరి అరచేతిలోకి వచ్చేయడంతో సెలబ్రిటీలు- సామాన్య ప్రజల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది.

తెలుగు సినిమాలతో పాటు దక్షిణాది తెరపై తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న రాశీ ఖన్నా.. అటు సోషల్ మీడియా లోను హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ షేర్ చేస్తూనే ఏ మాత్రం సమయం దొరికినా నెటిజన్లతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ చిట్ చాట్‌లో బాయ్ ఫ్రెండ్ తాలూకు ప్రశ్నపై ఆసక్తికరంగా బదులిచ్చింది రాశీ ఖన్నా.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన రాశీని నెటిజన్లు ఎన్నో రకాలుగా ప్రశ్నించారు. ఆమె కెరీర్, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం నేరుగా ‘మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని అడిగేయడంతో ఆమె క్రేజీ రియాక్షన్ ఇచ్చింది. ‘అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు’ అని క్లారిటీ ఇస్తూనే ‘ఏదో అలా సింగిల్‌గా గడిపేస్తున్నా’ అని సమాధానం చెప్పింది.
telugu samayamఅలాంటి పనులు చేయోద్దంటూ అసహనం!.. శివ బాలాజి భార్యపై మోహన్ బాబు ఆగ్రహం
కెరీర్ ఆరంభం నుంచే తన టాలెంట్‌ నిరూపించుకుంటూ వస్తున్న రాశీ ఖన్నా.. ఇటీవలే ”వెంకీ మామ, ప్రతిరోజూ పండగే” లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో ”తుగ్లక్ దర్బార్, అరన్మనై 3, మేథావి, సైతాన్ కా బచ్చా”.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Rashi KhannaSource link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Money Heist Tamil actor eight minutes video viral – தமிழ் News

கடந்த சில ஆண்டுகளாக நெட்பிளிக்ஸ் ஓடிடி தளத்தில் ஒளிபரப்பாகி வந்த ’மணி ஹெய்ஸ்ட்’ என்ற தொடரை பார்க்காதவர்கள் கிட்டத்தட்ட இருக்க மாட்டார்கள் என்பதும் மிகவும் விறுவிறுப்புடன் ஒளிபரப்பாகி வந்த ’மணி ஹெய்ஸ்ட்’...