Wednesday, December 8, 2021
Homeతెలుగు NewsసినిమాSreerama Chandra: Bigg Boss 5 Telugu : రాత్రంతా అదే మాట్లాడుకున్నాం!.. హమీద వెళ్లిపోవడంతో...

Sreerama Chandra: Bigg Boss 5 Telugu : రాత్రంతా అదే మాట్లాడుకున్నాం!.. హమీద వెళ్లిపోవడంతో శ్రీరామచంద్ర ఎమోషనల్ – nagarjuna telugu bigg boss season 5 october 10 written updates hamida elimination


ప్రధానాంశాలు:

  • బిగ్ బాస్ ఇంట్లో దసరా పండుగ
  • హమీద ఎలిమినేషన్
  • శ్రీరామచంద్ర ఎమోషనల్

బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండే ముగిసింది. దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. నవరాత్రుల సందర్భంగా ఇంటి సభ్యులకు నాగార్జున స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చాడు. అలా మొత్తంగా తొమ్మిది ఆటలు, తొమ్మిది బహుమతులు అంటూ ఇంటి సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను చూపించాడు. అలా చివరకు ఫ్యామిలీ ఎమోషన్లలో తడిసిపోయారు కంటెస్టెంట్లు.. చివరకు హమీద ఎలిమినేషన్‌తో శ్రీరామచంద్ర కన్నీరుపెట్టేసుకున్నాడు.

ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హమీద.. ఒక్కొక్కరి గురించి మంచి చెడులను చెప్పింది. ఈ క్రమంలో మానస్ మంచోడే కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని చెప్పింది. కాజల్ అయితే నకిలీ మనిషి. ఆమె బంధాలకు విలువ ఇవ్వదని హమీద పేర్కొంది. జెస్సీతో అంత ఫ్రెండ్ షిప్ లేదు. మొదటి వారంలో పిల్లి గొడవ తరువాత క్లోజ్ కాలేదు. సిరి అయితే అటూ ఇటూ ఫ్లిప్ అవుతుంది. మొదట్లో బాగానే ఉండేది. కానీ మధ్యలో మారిపోయింది. ఎందుకో తెలీదు. షన్ను కూడా ఫ్లిప్ అయినట్టు అనిపిస్తోంది.

ప్రియాంక ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. ఆమెకు నిజంగానే ప్రేమ ఉందా?లేదా? అలా ఊరికే చూపిస్తుందా? అనేది అర్థం కాదు. ప్రియ విషయంలో నాకు ఓ గిల్ట్ ఉండేది. కెప్టెన్ కాకుండా చేశాను అని. కానీ అది ఈ వారంతో పోయింది. ఆనీ మాస్టర్ చాలా మంచివారు. నాకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్తుంటాను. ఎప్పుడూ నవ్విస్తుంటాడు.. సన్నీ చాలా మంచివాడు. శ్వేత చాలా మంచిది. నా వరకు రవి అన్నయ్య చాలా మంచోడు. నాకు ఎప్పుడూ తోడుగా ఉండేవాడు. మొదట్లో నాకు చలి వేస్తుందంటే డ్రెస్ ఇచ్చాడు.

విశ్వ.. ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు. తెలియకుండా మాట్లాడితే.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకోలేం. ఎదుటి వారి గురించి ఎదురుచూడకుండానువ్వే వెళ్లి మాట్లాడు. లోబో చాలా మంచి వాడు. శ్రీరాం మంచివాడు. ఏం జరిగినా వెంటనే క్లియర్ చేసుకోవాలని అనుకుంటాడు. జెస్సీ విషయంలోనూ శ్రీరాం రాత్రంతా తినకుండానే ఉన్నాడు అని ఇలా ఇంటి సభ్యులందరి గురించి హమీద చెప్పింది.

అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో శ్రీరామచంద్రను నాగార్జున ఓ మాట అడిగాడు. నీకు బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా? హమీద ముఖ్యమా? అని ప్రశ్నించాడు. దీంతో హమీదకు ఏదో తేడా కొట్టిందట. అందుకే నేను వెళ్లిపోతే ఏం చేస్తావ్.. ఎలా ఉంటావ్ అని రాత్రంతా మాట్లాడుకున్నామని శ్రీరామచంద్ర తెలిపాడు. అయితే హమీదకు వెళ్లే ముందు తన ప్రేమను పాట రూపంలో వినిపించాడు శ్రీరామచంద్ర. నా హృదయంలో నిదురించే చెలి అంటూ శ్రీరామచంద్ర పాడిన పాటకు హమీద కన్నీరు పెట్టేసుకుంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds