Sunday, July 25, 2021
Homeతెలుగు NewsసినిమాSrikanth Addala: Narappa: సినిమా ఫెయిల్‌ అవుతుంది కానీ ద‌ర్శ‌కుడు కాదు: ‘నారప్ప’ డైరెక్టర్ శ్రీకాంత్...

Srikanth Addala: Narappa: సినిమా ఫెయిల్‌ అవుతుంది కానీ ద‌ర్శ‌కుడు కాదు: ‘నారప్ప’ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇంటర్వ్యూ – director srikanth addala interview about narappa movie


కరోనా నేపథ్యంలో సినిమా సందడి కరువైంది. థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో OTTలోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ ఓటీటీలో చిన్న చిన్న సినిమాలే విడుదలౌతుండగా.. రేపు వెంకటేష్ ‘నారప్ప’ ఓటీటీలో సందడి చేయబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌ హీరోగా న‌టించిన మాస్ యాక్ష‌న్‌ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `నార‌ప్ప‌`. డి. సురేశ్‌బాబు, కలైపులి యస్‌.థాను నిర్మించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన విశేషాలు మీకోసం.

‘అసురన్‌’ను తీసిన చోటే నారప్ప షూటింగ్

– కొన్ని మంచి సినిమాలను డిస్ట్రబ్‌ చేయకపోవడమే బెటర్‌. ‘నారప్ప’ సినిమాలో ఎమోషన్‌ మిస్‌ కాకుండా చేశాను. కాక‌పోతే మ‌న తెలుగు ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను. ‘నారప్ప’ సినిమా కోసం 50 రోజుల లాంగ్‌ షెడ్యూల్‌ చేశాం. కోవిడ్‌ కారణంగానే మా షూటింగ్‌ కొంత ఆలస్యం అయ్యింది. మ‌న నేటివిటీ ఉండాల‌నే అనంతపురంలో దాదాపు 10 రోజుల షూట్‌ జరిపాం. ఆ త‌ర్వాత మేజర్‌ షూటింగ్‌ అంతా ఓరిజనల్‌ మూవీ ‘అసురన్‌’ను తీసిన చోటే తీశాం.

నేను చేస్తానంటే అవకాశం ఇచ్చారు
– తమిళంలో అసురన్‌ సినిమాను చూశాను. ఒక‌సారి కథల చర్చల్లో భాగంగా నిర్మాత సురేష్‌బాబుగారిని నేను కలిసినప్పుడు అసురన్‌ రైట్స్‌ తీసుకున్నారని తెలిసింది. డైరెక్టర్‌గా ఎవర్నీ అయినా అనుకున్నారా? అని అడగ్గా లేదన్నారు. నాకు ఆసక్తి ఉందని చెప్పడంతో ఆయన నన్ను డైరెక్టర్‌గా ఓకే చేశారు. ఆ తర్వాత చెన్నై వెళ్లిన తర్వాత నిర్మాత కలైపులి యస్‌. థానుగారికి కలిసి సినిమా మొద‌లుపెట్టాం.

రీమేక్‌ అంటే రిస్కే..
– ఎలాంటి సినిమానైనా హ్యాండిల్‌ చేయగల సత్తా ప్రతి డైరెక్టర్‌ కు ఉంటుంది. ఎమోషన్స్‌ పరంగా నారప్ప కూడా సెన్సిబుల్‌ సినిమాయే. రీమేక్‌ అంటే కథ ఒక్కటే ఉంటుంది. మిగతా కష్టం అలానే ఉంటుంది. రీమేక్‌ను బాగా తీస్తే ఒకే. లేకపోతే ఉన్న సినిమాను ఉన్నట్లుగా కూడా తీయలేకపోయారని విమర్శలు చేస్తుంటారు. అందుకే రీమేక్‌ అంటే రిస్కే. ‘అసురన్‌’ సినిమాలోని ఎమోషన్‌ను అలానే ‘నారప్ప’ సినిమాలో క్యారీ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది.

వెంకటేశ్‌ గారు బాగా నిరుత్సాహపడ్డారు
–‘నారప్ప’ సినిమాను థియేటర్స్‌కు తగ్గట్లే తీశాం. కానీ పరిస్థితుల కారణంగా ‘నారప్ప’ ఓటీటీకి వెళుతుంది. నేను కాదు.. వెంకటేశ్‌ గారు కూడా బాగా నిరుత్సాహపడ్డారు. ‘నారప్ప’ పాత్ర కోసం వెంకటేశ్‌ గారు బాగా కష్టపడ్డారు. ఆయన కష్టం విడుదలైన ‘నారప్ప’ ప్రమోషన్‌ వీడియోస్‌లో కనిపిస్తుంది. ‘నారప్ప’ పాత్రలో వెంకటేశ్‌గారు పరకాయప్రవేశం చేశారు. వెంకటేశ్‌గారు పాత్రను ఓన్‌ చేసుకుని చేశారు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి బాగా చేశారు. ‘అసురన్‌’లాంటి సినిమాలను తీసిన వెంట్రీమారన్‌ను అభినందించాల్సిందే. ‘నారప్ప’ సినిమా జర్నీ మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది.

సినిమా ఫెయిల్ కానీ దర్శకుడు కాదు
– డైరెక్టర్‌గా నాకు గ్యాప్‌ వచ్చింది. కోవిడ్‌ కారణంగా ఈ గ్యాప్‌ ఇంకొంచెం పెరిగింది. కథలో లోటుపాట్లు ఉండి ఆడియన్స్‌ కనెక్ట్‌ కాకపోతే సినిమా ఫెయిల్‌ అవుతుంది కానీ ద‌ర్శ‌కుడు కాదు. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘అన్నా య్‌’ సినిమాను మూడు భాగాలు తీయాలనుకుంటున్నాను. ఈ కథకు ఆ స్పాన్‌ ఉంది. ఇది పీరియా డికల్‌ ఫిల్మ్‌. 1970, 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు కథ నచ్చింది కాబట్టి ‘అన్నయ్‌’ చేస్తున్నాను. డిజటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వచ్చిన తర్వాత అవకాశాలు బాగానే ఉంటున్నాయి. ఈ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Today's news

Latest offer's