Monday, July 26, 2021
Homeతెలుగు NewsసినిమాThaman: Devi Sri Prasad: తమన్ కాపీ సాంగ్‌‌తో సందీప్ వంగా ట్వీట్.. దేవిశ్రీ ప్రసాద్...

Thaman: Devi Sri Prasad: తమన్ కాపీ సాంగ్‌‌తో సందీప్ వంగా ట్వీట్.. దేవిశ్రీ ప్రసాద్ రిప్లయ్‌తో రచ్చ రచ్చ.. కావాలనే ఇరికించారా? – thaman facing copy allegations again over sandeep reddy vanga and devi sri prasad tweets


టైం బాబూ.. టైం.. టాలెంట్ ఉండటమే కాదు.. టైం కూడా కలిసిరావాలి.. మన కోటా గారు చెప్పినట్టు గుమ్మడికాయ అంత టాలెంట్‌తో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా కలిసి రావాలి. యువ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి అదృష్టం టన్నులు టన్నులే ఉన్నట్టు ఉంది. అందుకే పట్టిన ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవుతుంది. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ భాషల్లో సైతం మనోడి మోత మారుమోగిపోతుంది. తాజాగా శంకర్ – రామ్ చరణ్ మూవీకి కూడా ఇతనే దరువేసేది. నిజానికి అప్పట్లో రమణగోగుల ఆ తరువాత ఆర్పీ పట్నాయక్ ఇలా కొంతమంది దర్శకులు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపారు. ఆ తరువాత స్లో అయిపోయారు. అయితే తమన్ హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒకేసారి 16 సినిమాలు చేసిన హిస్టరీ తమన్‌కి ఉంది.

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టి.. ఏకదరువు వాయిస్తున్న తమన్‌కి అంతా బాగానే ఉన్నా.. కాపీ క్యాట్ అనే పేరు మాత్రం వెంటాడుతూనే ఉంది. కెరియర్ స్టార్టింగ్ మొదలు ఇప్పటి వరకూ తమన్ కాపీ కొట్టిన ట్యూన్స్ చాలానే ఉన్నాయి. వీటిపై చర్చ నడుస్తూనే ఉంది. పలు సందర్బాల్లో తనపై వచ్చిన కాపీ క్యాట్ రూమర్లను ఖండించారు తమన్.

ఇక తమన్ రాకతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ హవా తగ్గిందనే చెప్పాలి. ఎవరి సినిమాలు వాళ్లకి వస్తాయ్ అని పైకి చెప్తున్నా.. పోటీ మాత్రం గట్టిగానే ఉంది. ఈ తరుణంలో దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్‌పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌లో సూర్యుని చుట్టూ రెన్ బోన్ కనువిందు చేసింది. ఈ రెయిన్ బో ఫొటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ రెయిన్ బో వీడియోను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోకి Bella Chao Chao Chao అనే వెస్టరన్ మ్యూజిక్‌కి సాంగ్‌ని యాడ్ చేశాడు సందీప్ వంగా. అయితే ఈ సాంగ్ సేమ్ టు సేమ్ మహేష్ బాబు ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో ఓ పిల్లా చావ్ సాంగ్‌కి కాపీలా ఉంది. తమన్ అక్కడ నుంచి ఎత్తేసి.. బిజినెస్‌మేన్‌లో పెట్టినట్టుగానే ఈ ట్యూన్ ఉంది. అయితే తమన్‌ కాపీ ట్యూన్ రూమర్లు రావడం కొత్తేం కాదు.. పైగా ఈ సాంగ్ కాపీ అక్కడ నుంచి ఎత్తేశాడని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.

అయితే సందీప్ వంగ ట్వీట్‌పై దేవి శ్రీ ప్రసాద్ రియాక్ట్ అయ్యి.. ‘వావ్ బ్యూటిఫుల్ షాట్ సర్’ అని కామెంట్ పెట్టాడు. ఇంతకీ ఈయన షాట్ అన్నాడా? లేక సాంగ్ అన్నాడా? అని నెటిజన్లు స్పందించడం మొదలుపెట్టారు. ‘ఆ సాంగ్ కాపీ కొట్టాడనే కదా అన్నా .. నువ్ రిప్లై ఇచ్చావ్’ అని దేవి శ్రీ ప్రసాద్‌ని ఇరికించేస్తున్నారు నెటిజన్లు. అమ్మ తమన్ మళ్లీ దొరికిపోయావ్‌గా.. అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (RC15 Movie) చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి దరువు వేయబోతున్నాడు యువ సంగీత దర్శకుడు తమన్. వీటితో పాటు మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, అఖిల్ ‘ఏజెంట్’, వరుణ్ తేజ్ ‘గని’ ఇలా చాలా చిత్రాలకు తమన్ సంగీతం వాయిస్తున్నారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ చిత్రానికి కూడా తమన్ స్వరాలను సమకూర్చారు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

டோக்கியோ ஒலிம்பிக் : ஜூலை 25 அன்று இந்தியா பங்கேற்கும் போட்டிகள் விவரம்

ஜப்பான் தலைநகர் டோக்கியோவில் நடைபெற்று வரும் ஒலிம்பிக்கில் மூன்றாம் நாளான ஜூலை 25 அன்று பேட்மிண்டன், துப்பாக்கிச் சுடுதல், குத்துச் சண்டை மாதிரியான ஈவெண்டுகளில் இந்திய வீரர்கள் மற்றும் வீராங்கனைகள் பங்கேற்க...

Today's news

Latest offer's