ప్రధానాంశాలు:
- లైగర్ షూటింగ్లో విజయ్ దేవరకొండ బిజీ
- గుర్రపు స్వారితో రౌడీ రచ్చ
- ఎప్పటికైనా ఓ గుర్రాన్ని కొంటానన్న హీరో
తెలుగు హీరోల్లో చాలా మందికి హార్స్ రైడింగ్ వచ్చు. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి హార్స్ రైడింగ్ తెలుసు. ఇక రామ్ చరణ్‌కు అయితే చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ ఇష్టం. బాల్యం నుంచి కూడా అందులో ట్రైనింగ్ తీసుకున్నాడు. మగధీర సినిమాలో వాడిన గుర్రాన్ని రామ్ చరణ్ సొంతంగా ఉంచేసుకున్నాడు. కాజల్, బాద్ షా వంటి గుర్రాలు తన ఫాం హౌస్‌లో ఉంటాయి.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గుర్రాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడట. తనకుగుర్రాలు అంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఓ గుర్రాన్ని సొంతం చేసుకుంటాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. విజయ్ చేతిలో ప్రస్తుతం ఒక్క లైగర్ సినిమానే ఉంది. సుకుమార్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. దిల్ రాజుతో చర్చల్లో ఉంది. కానీ ఇవి ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరికీ తెలియదు.
లైగర్ సినిమా కూడా ఎప్పుడు వస్తుందనేదానిపై క్లారిటీ లేదు. సమ్మర్లో రానుందని మేకర్లు చెబుతున్నారు. ఆగ్ లగా దేంగే అంటూ రచ్చ చేస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు.