Monday, July 26, 2021
Homeతెలుగు NewsసినిమాVikrant Rona : నెక్ట్స్ టైం రెడీగా ఉండు!.. హీరోకు సవాల్ విసిరిన జాక్వెలిన్

Vikrant Rona : నెక్ట్స్ టైం రెడీగా ఉండు!.. హీరోకు సవాల్ విసిరిన జాక్వెలిన్



photo 84557540

కేజీయఫ్ సినిమా తరువాత కన్నడ నుంచి ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అక్కడి స్టార్ హీరోల సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. అలా కన్నడ ఇండస్ట్రీ కూడా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. కిచ్చా సుదీప్ సినిమా గురించి ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

దుబాయ్‌‌లోని బుర్జ్ ఖలీఫా బిల్డిండ్ మీద విక్రాంత్ రోనా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అక్కడే చిత్రయూనిట్ ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించింది. అలా దుబాయ్‌లో అంత గ్రాండ్‌గా ఓ సినిమా ఈవెంట్ జరగడం అదే మొదటిసారి. అలా విక్రాంత్ రోనా సినిమా ఒక్క సారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఈ మూవీలో శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ భాగస్వామి అయ్యారు.

విక్రాంత్ రోనాలో కిచ్చా సుదీప్‌తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను టీం ఎంతో బాగా చూసుకుంది. ఎంతో చక్కగా గౌరవించారు.. స్వాగతించారు. కిచ్చా సుదీప్‌తో పని చేయడం ఓ అనుభవం. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండేపోయే ఓ అనుభూతి. మనం నెక్ట్స్ టైం కలిసినప్పుడు చెస్ ఆటను మరింత టఫ్‌గా ఆడుదాం రెడీగా ఉండు అని సుదీప్‌కు సవాల్ విసిరారు. విక్రాంత్ రోనాను ఇంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నావ్.. నీ ఆలోచనల్లోని స్పష్టత, నీ విజన్ అద్భుతం అని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం గర్వించేలా ఈ విక్రాంత్ రోనా ఉండబోతోందని జాక్వెలిన్ అన్నారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

OPS அவசர தில்லி பயணம்; அரசியல் பரபரப்பிற்கான காரணம் என்ன..!!

அதிமுக ஒருங்கிணைப்பாளரும் , துணை எதிர்க்கட்சித் தலைவருமான ஓ. பன்னீர்செல்வம், முன்னறிவிப்பு எதுவும் இல்லாமல், மேற்கொள்ளும் திடீர் தில்லி பயணம் அரசியல் பரபரப்பை ஏற்படுத்தியுள்ளது.  Source link

Today's news

Latest offer's