Homeతెలుగు Newsఫిట్‌నెస్Wall sit : రోజుకి 5 నిమిషాలు ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందట.. -...

Wall sit : రోజుకి 5 నిమిషాలు ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందట.. – what happens when do wall sits in a day know here all


రోజుకు అయిదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని పనిష్మెంట్ విభాగం నుంచి తీసి వేసి వ్యాయామంగా భావించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గోడ కుర్చీ వ్యాయామం చేసేందుకు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎంచక్కా ఇంట్లోనే చేసుకోవచ్చు.
జిమ్ చేసే అబ్బాయిల్నే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారా..
గోడ కుర్చీ ఎలా వేయాలి?

గోడకు ఆనుకుని ఉన్న ఒక కుర్చీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. శరీరాన్ని ఆ కుర్చీ పోజులో ఇమిడ్చి కొంతసేపు ఒణకకుండా, కదలకుండా ఉంచడాన్నే గోడ కుర్చీ అంటారు. ఇది చేయడానికి గోడకు మీ రెండు పాదాలను సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటరుగా నిలబడాలి. మోకాలు నుంచి పాదాల వరకు కాళ్ళను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాలి నుంచి పిరుదుల వరకూ ఉండే శరీర మధ్య భాగాన్ని భూమికి సమాంతరంగా చేసి శరీర పైభాగాన్ని నిటారుగా చేయాలి. అప్పుడే శరీరంలోని పైభాగం గోడకు ఆనుతుంది. అప్పుడు చేతులు బార్లా చాపి భూమికి సమాంతరంగా పెడితే అవి గోడకు ఆనుకుని ఉంటాయి. ఇప్పుడు మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. అలానే కదలకుండా, పడిపోకుండా మీ ఓపికను బట్టి సుమారు 5 నిమిషాలు ఉండండి.

1) నేటి టెక్నాల‌జీ కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది త‌ర‌చూ ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆ ఒత్తిడిని నిర్ల‌క్ష్యం చేస్తే చివ‌ర‌కు డిప్రెష‌న్‌కు దారి తీస్తుంది. అయితే ప్ర‌తి రోజు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మై మ‌న‌సు ప్ర‌శాంత‌ంగా మారుతుంది.

2) పొట్ట చుట్టూ కొవ్వుతో ఇబ్బంది ప‌డే వారు రెగ్యుల‌ర్‌గా గోడ కుర్చీ వేయాలి. త‌ద్వారా పొట్ట వ‌ద్ద ఉండే కండ‌రాలు దృఢంగా మారి కొవ్వు క్ర‌మ క్ర‌మంగా క‌రుగుతూ ఉంటుంది. నమ్మరాని విషయం ఏంటంటే గోడ కుర్చీ వల్ల బరువు తగ్గొచ్చు. కండరాలను ఎక్కువ కాలం పాటూ సంకోచించేలా చేయడం వల్ల అధిక కేలరీలు ఖర్చవుతాయి. ఇలా కొన్ని సెకన్ల పాటూ కూర్చున్నా చాలు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కేలరీలు ఖర్చవ్వడం శరీరమంతా జరుగుతుంది. మీ హృదయ నాళ వ్యవస్థ పని చేయడం ప్రారంభమైతే కేలరీలు బర్న్ కావడం అధికంగా ఉంటుంది.

3) వెన్ను నొప్పితో బాధ ప‌డే వారికి కూడా గోడ కుర్చీ వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. ప్ర‌తి రోజు ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే గ‌నుక వెన్నెముక గ‌ట్టిగా మారి నొప్పి నుంచి విముక్తి ల‌భిస్తుంది. వెన్ను నొప్పితో బాధపడే వారు రెగ్యుల‌ర్‌గా గోడ కుర్చీ వేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.

గోడ కుర్చీతో లాభాలు

4) శరీరం బరువుగా, బద్ధకంగా అనిపించే వారికి గోడకుర్చీ చాలా మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే శరీరం తేలిక అనిపిస్తుంది. చురుగ్గా మీరు ఇటూ అటూ కదలగలుగుతారు. శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
కన్యారాశి వారు వీరిని పెళ్ళి చేసుకుంటే రొమాంటిక్ లైఫ్‌ గడుపుతారట..
5) గోడకు ఆనుకుని కూర్చునే గోడు కుర్చీలో ఓర్పును పెంచే గుణం ఉంది. రోజుకు అయిదు నిమిషాలు గోడకుర్చీ పొజిషన్‌లో కూర్చుంటే మానసికంగా చాలా శక్తివంతంగా తయారవుతారు. గోడకుర్చీ మనిషి ఏకాగ్రతను పెంచుతుంది. ఏ విషయంపైనైనా ఫోకస్ బాగా పెట్టి ఆలోచించగల శక్తిని ఇస్తుంది.

6) గోడ కుర్చీ వేయడం వల్ల గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. కాళ్ల‌లో ఉండే కండ‌రాలు దృఢంగా మారి పిక్క‌లు గ‌ట్టి ప‌డ‌తాయి. గోడ కుర్చీ తరచుగా వేస్తే ఎక్కువ సేపు నడిచినా, పరిగెత్తినా, పనిచేసినా అలసట రాదు. శరీరంలోని కండరాల పటుత్వానికి, శక్తికి కూడా గోడ కుర్చీ చాలా మేలు చేస్తుంది.

ఇటీవల భారతీయులలో డయాబెటిస్ చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి. ప్రమేహం, అతిమూత్రం, మధుమూత్రం, మధుమేహం అని. కానీ ఇప్పుడు డయాబెటీస్ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలను బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీస్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడం వల్ల మోకాళ్లకు, మోకాలి చిప్పలకు, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకు బలం చేకూరి ఎముకల బలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా ఉంటాయి. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ రోజూ గోడకుర్చీ వేసే వారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్‌ రాదని వైద్యులు సూచిస్తున్నారు.

అందువల్ల రోజుకు 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేయడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల తరువాత మీ ఆరోగ్యంలో మెరుగుదలను మీరే గుర్తిస్తారు. శరీరంలో క్యాల‌రీలు సైతం క‌రుగుతాయి కాబ‌ట్టి పెద్ద పెద్ద వ్యాయామాలు చేయ లేని వారు గోడ కుర్చీని రెగ్యులర్‌గా వేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
Healthy Vegetable : గుమ్మడికాయ తింటే బరువు పెరగరా..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read