Homeతెలుగు Newsఫిట్‌నెస్workout benefits: ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి.. - can workout get rid of...

workout benefits: ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి.. – can workout get rid of depression know here all


శారీర‌క ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంలో మాన‌సిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. డ్రిపెష‌న్, ఆందోళ‌న వంటి మాన‌సిక అనారోగ్యాలు వ్య‌క్తుల సామ‌ర్థ్యాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి. త‌ద్వారా క్ర‌మ‌క్ర‌మంగా మ‌నం దీర్ఘ‌కాలిక వ్యాధులు, శారీర‌క ఆరోగ్యంగా స‌మ‌స్య‌లు త‌లెత్తి మాన‌సిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతాయి. దీంతో మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గే అవ‌కాశం కూడా ఉంది. వ్యాయామం అనేది మ‌నం శారీర‌క ఆరోగ్యానికి ఎంత అవ‌స‌ర‌మో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే వ్యాయామం శారీర‌క ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు. అది మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తోడ్ప‌డుతుంది. తాజా ప‌రిశోధన‌ల్లో రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేసే అల‌వాటు ఉన్న‌వారు మాన‌సిక ఆరోగ్యం క‌లిగి ఉండి చాలా చురుకుగా ఉంటార‌ని తేలింది.
ఇలాంటి డ్రెస్ వేసుకుంటే శృంగారం బాగా చేస్తారట..
మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి చెడు అల‌వాట్లు, వ్య‌క్తిగ‌త జీవితంలో వ‌చ్చే చిన్న చిన్న స‌మ‌స్య‌లు మ‌రియు చ‌దువులో వెనుక‌బ‌డ‌టం త‌దిత‌ర స‌మ‌స్య‌ల వ‌ల‌న కూడా మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. దీనివ‌ల‌న నిద్ర‌లేమి త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను కూడా కొనితెచ్చుకుంటున్నాం. అయితే తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఆట‌ల్లో లేదా ఏదైనా వ్యాయామాలు చేసే అల‌వాటు ఉన్న‌వారు మానస‌క ఆరోగ్యం క‌లిగి ఉన్నార‌ని తేలింది. వ్యాయామాలు లేదా ఆట‌లు ఆడ‌టం అల‌వాటు లేనివారు అనేక మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాట్లు ఈ అధ్య‌య‌నం తెలియ‌జేస్తుంది. అన్నిర‌కాల శ‌రీర‌క ప‌నులు, చిన్న‌పిల్ల‌ల పోష‌ణ‌, ఇంటి ప‌ని, గార్డెనింగ్, ఫిషింగ్ లేదా సైక్లింగ్ , జిమ్‌లో వ్యాయామాలు చేయ‌డం, ర‌న్నింగ్, స్కిప్పింగ్ వంటి పాటించ‌డం ద్వారా మానిసిక ఆరోగ్యం పెంపొందించుకోవ‌చ్చ‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. వారానికి మూడు నుండి ఐదు సార్లు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వ‌ల‌న చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని 2018లో లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తెలిపింది.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపిన స‌మాచారం ప్ర‌కారం ప్ర‌పంచంలో ఉండే జ‌నాభాలో 5% మంది ఒత్తిడికి గుర‌వుతున్నారు. సుమారు 700000 మంది ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతున్న‌ట్లు ఈ సంస్థ తెలియ‌జేసింది. 15-29 సంవ‌త్స‌ర‌ముల వ‌య‌స్సు గ‌లవారి మ‌ర‌ణాల్లో ఆత్మ‌హ‌త్య‌లు నాలుగ‌వ స్థానంలో ఉన్నాయి. బాధ‌, చిరాకు, ఏదైనా ప‌నిపై ఏకాగ్ర‌త లేక‌పోవ‌డం, అప‌రాధ భావం లేదా మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, నిస్స‌హాయ‌త‌, ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు, నిద్ర‌లేమి, ఆక‌లి లేక‌వ‌పోవ‌డం లేదా శ‌రీర బ‌రువులో మార్పులు ఒత్తిడి యొక్క ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. అయితే చాలామంది మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ఎక్కువ‌సేపు వ్యాయామాలు చేస్తుంటారు. అలాచేయ‌డం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని కొన్ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి.

వర్కౌట్‌తో ఎన్నో లాభాలు

వ్యాయామం అనేది మ‌న వ‌య‌స్సు, జాతి, ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా మాన‌సిక ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించే ఒక సాధ‌నం. మ‌నం ఎటువంటి వ్యాయామం చేస్తున్నాం, దాని కాల వ్య‌వ‌ధి మ‌రియు ఫ్రీక్వెన్సీ కూడా మాన‌సిక ఆరోగ్యం పెంపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. వీటిని ఆధారంగా చేసుకొని మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌ర‌చుకోవాల‌నుకునే వారికి స‌రైన వ్యాయామ ప‌ద్ధ‌తుల‌ను నిర్ణ‌యిస్తున్న‌ట్లు యేల్ యూనివ‌ర్శిటీ సైకియాట్రీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు నిర్ధారించారు.
వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే అలా చేయొద్దు..
ఈ రీస‌ర్చి కోసం వారు సుమారు 1.2 మిలియ‌న్ల యువ‌తీ యువ‌కుల నుండి వారి అభిప్రాయాల‌ను సేక‌రించారు. 30 రోజులుగా వారు మానిస‌క స్థితి గురించి తెలుసుకొని వారు ఈ కాలంలో ఎంత స‌మ‌యం వ్యాయామానికి కేటాయించారో తెలుసుకొని ఈ స్ట‌డీ కొన‌సాగించారు. స‌గ‌టును ప్ర‌తి ఒక్క‌రు 3.4 రోజులు పేల‌వ‌మైన మాన‌సిక ఆరోగ్యాన్ని అనుభ‌వించిన‌ట్లు ఈ స్ట‌డీలో తేలింది.
ఈ స్ట‌డీ కోసం వారు 75 ర‌కాల వ్యాయామాల‌ను ఉప‌యోగించారు. క్రీడ‌లు, సైక్లింగ్‌, ఏరోబిక్ మ‌రియు జిమ్ చేయ‌డం వంటి బ‌ల‌మైన వ్యాయామాల‌ను పాటించేలా శ్ర‌ద్ధ తీసుకున్నారు. ఈ అధ్య‌య‌నంలో ఇంటి ప‌నుల‌ను పూర్తిచేయ‌డం వ‌ల‌న కూడా మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డిన‌ట్లు తేలింది.

రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేసే వారికి అది చాలా కాల క్ర‌మేనా అది వారికి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే వారు వ్యాయామంతో వారికి కావాల్సిన మానసిక మ‌రియు శారీర‌క ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అందుకే రోజూ వ్యాయామం చేసేవారి మాన‌సిక స్థితి చాలా బ‌లంగా ఉంటుంది. వీరు చాలా ఏకాగ్ర‌త క‌లిగి వారు రోజూ చేసే ప‌నుల‌లో చురుకుద‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు.

వ్యాయామం మ‌రియు మ‌న మాన‌సిక ఆరోగ్యం మ‌ధ్య చాలా విచిత్ర‌మైన సంబంధం ఉంటుంది. అందుకే మ‌నం జీవితంలో ఇన్‌యాక్టివ్‌గా ఉంటే అది ప‌లు మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు దారితీయ‌వ‌చ్చు.

అయితే మీకు ఇప్ప‌టివ‌రకు వ్యాయామం చేసే అల‌వాటు లేక‌పోతే వెంట‌నే మీరు వెంట‌నే మీకు న‌చ్చిన మీరు మీ శ‌రీరానికి అనువైన వ్యాయామ ప‌ద్ధ‌తిని ప్రారంభించ‌వ‌చ్చు. మీకు చిన్న‌ప్ప‌టి నుండి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ లేదా ఇంకా ఏదైన వ్యాయామానికి సంబంధించిన చిన్న చిన్న అల‌వాట్లు ఉంటే వాటినే మీరు మీ వ్యాయామంగా మ‌ర‌లా కొన‌సాగించ‌వ‌చ్చు. అందువ‌ల‌న మీరు వ్యాయామంలో బోర్ ఫీల‌వ‌కుండా ఉండ‌డ‌మే కాక మీ న‌చ్చిన ప‌ని అవ‌డం వ‌ల‌న చాలా ఉల్లాసంగా రోజు పాల్గొన‌వ‌చ్చు. మీరు రోజు ఎటువంటి వ్యాయామం చెయ్యాల‌నుకుంటున్నారు, ఎంత స‌మ‌యం కేటాయించాల‌నుకుంటున్నారు అనేది మీ డైరీలో లేదా క్యాలెండ‌ర్‌లో నోట్ చేసుకోవ‌డం కూడా చాలా మంచి అల‌వాటు. అంతేకాకుండా మీరు రోజు పాటించే వ్యాయామాల‌ను స‌మీక్షించుకొని కొత్త‌వాటిని కూడా అప్పుడ‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తూ ఉండండి. మీరు ఇంటిలోనే కాకుండా మీ గార్డెన్ లేదా ఏదైనా అవుట్‌డోర్ ప్ర‌దేశంలో కూడా వ్యాయామం చేయ‌వ‌చ్చు. అవుట్‌డోర్ వాకింగ్ చేసే వ్య‌క్తులు చాలా చురుకుగా ఉంటూ ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, అల‌స‌ట వంటి వాటికి దూరంగా ఉంటున్నార‌ని కొన్ని అధ్య‌య‌నాలు కూడా తెలియ‌జేస్తున్నాయి.
ఈ రాశి వారికి రొమాన్స్ అంటే పిచ్చి..
అయితే ఇంకెందుకు ఆల‌స్యం ఈ వ్యాసంలో తెలిపిన సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటించి ఇప్పుడే మీకు న‌చ్చిన వ్యాయామాల‌ను పాటించ‌డం ప్రారంభించి మీ మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read