తెలుగు Newsఆరోగ్యంWorld Pneumonia Day 2022: వీరికి న్యూమోనియో వచ్చే రిస్క్‌ ఎక్కువ..!...

World Pneumonia Day 2022: వీరికి న్యూమోనియో వచ్చే రిస్క్‌ ఎక్కువ..! – know the symptoms and causes of pneumonia on world pneumonia day

-

World Pneumonia Day 2022: న్యుమోనియా.. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నిమోయనియాను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంది. న్యూమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2019లో.. 25 లక్షల మంది మరణించారు. అందులో 6.72 లక్షలు చిన్నారులు ఉండటం బాధాకర విషయం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులు. అందుకే, న్యుమోనియా రావడానికి కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. రేపు (నవంబర్‌ 12న) ‘ప్రపంచ న్యుమోనియా డే’. న్యుమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్ 2009 నవంబర్ 12 న మొదటిసారిగా ప్రపంచ న్యుమోనియా డేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ‘ప్రపంచ న్యుమోనియా డే’ జరుపుతున్నారు. న్యుమోనియా గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

న్యుమోనియా ఎందుకు వస్తుంది..?

95453332

న్యుమోనియా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజువాల వలన సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం శ్యాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి, కొద్దికాలానికి తెల్లరక్తకణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువుగా ఉన్నా, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. CDC ప్రకారం, ఒమిక్రాన్‌‌ వైరస్, SARS-CoV-2, ఇన్ఫ్లుఎంజా, RSV వైరస్ కూడా న్యుమోనియాకు కారణం కావచ్చు.

వీరికి రిస్క్‌ ఎక్కువ..

95453305

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలు, వృద్ధులు ఇద్దరూ సులభంగా నిమోనియాకు గురవుతారు. పిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వీరికి న్యుమోనియా త్వరగా ఎటాక్‌ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్సిరేటర్‌ సిన్సిషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యుమోనియా తరచుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌, స్మోకింగ్‌, మంచి ఆహారం తీసుకోనివారికి, డయాబెటిస్‌, హెచ్‌ఐవీ, క్యాన్సర్, గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి.. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. వీరికి న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఈ లక్షణాలు ఉంటాయి..

95453265

చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో దగ్గుతో పాటు రక్తం పడుతుంది. కొందరిలో కఫం చిక్కగా, కొందరిలో పలుచగా పడుతుంది. నోటి వెంట పడే కఫం రంగును బట్టీ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు.

చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయ్‌..

95453258

పసి పిల్లలకు, చిన్నారులకు న్యుమోనియా లక్షణాలు ఉండకపోవచ్చని మయోక్లినిక్‌ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా కారణంగా వాంతులు, జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉండవచ్చు.

బ్యాక్టీరియల్‌ న్యుమోనియాలో ఈ లక్షణాలు కనిపిస్తాయి..

95453241

జాన్స్ హాప్కిన్స్ ప్రకారం, బాక్టీరియల్ న్యుమోనియాలో కొన్ని తేలికపాటి, తీవ్రమైన లక్షణాలు ఉంటాయి.

 • పెదవులు, గోళ్లు నీలంగా మారడం
 • జ్వరం
 • దగ్గు, ఆకుపచ్చ, పసుపు కఫం, కఫంలో రక్తం పడటం
 • ఆకలి లేకపోవడం
 • చెమట పట్టడం
 • శక్తి లేకపోవడం
 • ఆయాసం
 • పల్స్‌ వేగంగా ఉండటం
 • చలి
 • ఛాతీ హెవీగా ఉండటం

వైరల్‌ న్యుమోనియా లక్షణాలు..

95453190

వైరల్‌ న్యుమోనియా లక్షణాలు.. బ్యాక్టీరియా న్యూమోనియా మాదిరిగానే ఉంటాయి.

 • తలనొప్పి
 • శ్వాస ఆడకపోవడం
 • కండరాల నొప్పి
 • బలహీనత
 • దగ్గు ఎక్కువగా రావడం

ఎలా నిర్థరించాలి

95453133

JOHNS HOPKINS ప్రకారం, ఎక్స్-రే, రక్త పరీక్ష, కఫ పరీక్ష, ఛాతీ CT స్కాన్, బ్రోంకోస్కోపీ వంటి పరీక్షలతో.. న్యూమోనియాను నిర్ధఱించవచ్చు. న్యూమోనియాను ఇంట్లోనే టెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ పల్స్‌ ఆక్సిమీటర్‌తో గుర్తించవచ్చు. పల్స్‌ ఆక్సిమీటర్‌ మన రక్తంలో ఆక్సిజన్‌ లెవల్‌ను మెజర్‌ చేస్తుంది. న్యూమోనియా కారణంగా.. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి.

ఇలా నివారించండి..

95453078
 • పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు.
 • బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు ఇవ్వడం, చక్కని శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో న్యుమోనియా రాకుండా చాలా వరకూ నివారించవచ్చు
 • ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
 • పొగకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి.
 • రోజు వ్యాయామం చేయడం మంచిది.
 • పోషకాహారం తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest news

“Is this a big cut out for the cloth?”…Vijay who put an order to the manager in tension…do you know what he will do??

Ajith starrer Thunivu and Vijay starrer Warisu are releasing for Pongal next year. After almost 8 years,...

These are all the premieres that will arrive on HBO Max in December

From youth series and new seasons to the new Warren file movie. Enjoy the new HBO Max...

North Korea Hackers Using New “Dolphin” Backdoor to Spy on South Korean Targets

The North Korea-linked ScarCruft group has been attributed to a previously undocumented backdoor called Dolphin that the threat...

Google Pixel 7a poses in the first renders. It promises to be a great smartphone in compact sizes

Google Pixel 7a promises to be a dream Android smartphone in the middle price range. Initial leaks...

ஒரு குறிப்பிட்ட வகை பக்கவாதம் அதிகரித்து வருகிறது

சப்அரக்னாய்டு ரத்தக்கசிவு என்பது மூளையை உள்ளடக்கிய சவ்வு மற்றும் அவற்றுக்கிடையேயான இடைவெளிக்கு இடையில் இரத்தப்போக்கு ஏற்படுவதாகும். இந்த இரத்தப்போக்கு பெரும்பாலும் இரத்த நாளங்கள்...

In this regard, there is no one in India equal to Kamal….! Famous producer says

Sakalagalavallavan was released in 1982. Directed by SB Muthuraman and starring Kamal, Ambika, Silk and VK Ramasamy,...

Must read