Home తెలుగు News ఆరోగ్యం belly button massage, Belly Button : బొడ్డుపై మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా.. – health and beauty benefits of oiling the belly button know here all

belly button massage, Belly Button : బొడ్డుపై మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా.. – health and beauty benefits of oiling the belly button know here all

0
belly button massage, Belly Button : బొడ్డుపై మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా.. – health and beauty benefits of oiling the belly button know here all

మనసు ప్రశాంతంగా..

ఆయిల్ థెరపీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా రిలాక్సేషన్‌ని ఇస్తుంది. బొడ్డు ప్రాంతంలో ఆయిల్ వేసి మసాజ్ చేయడం వల్ల ఆ ప్రభావం మనసుపై పడుతుంది. దీంతో మంచి మానసిక ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

చర్మ ఆరోగ్యం..

ఈ విషయాన్ని మీరు నమ్మి తీరాల్సిందే. బొడ్డుపై నూనె వేసి మసాజ్ చేయడం వల్ల అది చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. స్కిన్ మొత్త అందంగా మెరుస్తుంది.

Also Read : Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గాలా.. ఈ వర్కౌట్స్ చేయండి..

జాయింట్ పెయిన్స్..

నావెల్ థెరపీ అంటే బొడ్డు ప్రాంతంలో నూనె వేసి మసాజ్ చేయడం దీని వల్ల జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఎవరైతే ఎముకల్లో బలం లేకుండా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారో వారు రెగ్యులర్‌గా ఈ థెరపీ చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.

కళ్ళకి చాలా మంచిది..

బొడ్డుపై నూనె వేసి మసాజ్ చేయడం వల్ల అది నరాల్లో వైబ్రేషన్ తీసుకొస్తుంది. దీంతో కళ్ళ ఆరోగ్యం చాలా బావుంటుంది. కళ్ళల్లో మంటలు, పొడిగా మారడం వంటి సమస్యలు దూరమవుతాయి.

oil massage for fertility problems

సంతాన సమస్యల్ని దూరం చేసే మసాజ్

సంతాన సమస్యలు..

చాలా మంది పునరుత్పత్తి సమస్యల్ని ఎదుర్కొంటారు. అలాంటి వారు రెగ్యులర్‌గా బెల్లీ బటన్‌పై ఆయిల్ వేసి మసాజ్ చేయడం వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. దీంతో సంతాన సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Dinner : త్వరగా, హెల్దీగా రెడీ అయ్యే డిన్నర్ రెసిపీస్..

మృదువైన జుట్టు..

బొడ్డుకి, జుట్టుకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.. ఉంటుందండి బాబూ మన శరీరంలోని అనేక ప్రాంతాలన్ని బొడ్డు నరాలకి లింకై ఉంటాయి. కాబట్టి జుట్టు సమస్యలు కూడా దీని వల్ల తగ్గుతాయి. జుట్టు తెల్లబడడం, ఊడిపోవడం వంటి సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి బొడ్డుపై నూనెతో మసాజ్ చేయడం వల్ల.

జీర్ణ సమస్యలు దూరం..

బొడ్డుపై మసాజ్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి.

వీటితో పాటు..

బొడ్డుని ఎప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చని నీటితో మైల్డ్ సోప్ వేసి కడగాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు రావు. అదే విధంగా ఆరోగ్యం కూడా బావుంటుంది. కాబట్టి కచ్చితంగా ఎప్పటికప్పుడు నాభిని క్లీన్, నీట్‌గా చేసుకోండి.
Expert Solutions : నాతో కలవకుండానే నా భార్య ప్రెగ్నెంట్ అయింది.. ఏం చేయను..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here