Home తెలుగు News ఆరోగ్యం cancer symptoms, Cancer : ఈ లక్షణాలను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.. క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త.. – what is prostate cancer know here symptoms and treatment details

cancer symptoms, Cancer : ఈ లక్షణాలను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.. క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త.. – what is prostate cancer know here symptoms and treatment details

0
cancer symptoms, Cancer : ఈ లక్షణాలను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.. క్యాన్సర్ వస్తుందట జాగ్రత్త.. – what is prostate cancer know here symptoms and treatment details

ప్రపంచవ్యాప్తంగా చికిత్స తీసుకునే క్యాన్సర్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది. యంగ్ ఏజ్‌లో ఉండే పురుషులకు ఈ సమస్య వస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్లయితే కూడా సంభవించే అవకాశం ఉంది. ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్లకు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఉంది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్య ఉన్నట్లయితే ఇది మిగిలిన శరీర భాగాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి…?

ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్‌కి వస్తుంది. సెమెన్ ఉత్పత్తి చేసే అవయవానికి ఇది వస్తుంది. సాధారణంగా క్యాన్సర్ అనేది నార్మల్‌గా లేని శరీర భాగాల యొక్క సెల్స్ నుండి మొదలవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో అయితే ఈ అవయవం కంట్రోల్ లేకుండా వుండే సెల్స్ నుండి ఈ వ్యాధి వస్తుంది. అయితే అసలు ఇది ఎందుకు వస్తుంది..? ఈ విషయాన్ని చూస్తే.. ఇది అసలు ఎందుకు వస్తుంది అనే దాని వెనుక కారణాలు లేవు. మాయో క్లినిక్ ప్రకారం చూస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ భాగంలో సెల్స్ మారడం వల్ల డిఎన్ఏ లో మార్పులు వస్తాయి. సమస్య వుండే సెల్స్ ట్యూమర్ ని ఫామ్ చేసి ఇబ్బందులు కలిగిస్తాయి అని తెలుస్తోంది.
Garlic Benefits : వెల్లుల్లి తింటే షుగర్ తగ్గుతుందా..
ప్రొస్టేట్ క్యాన్సర్ లో రకాలు :

క్యాన్సర్ రీసెర్చ్ యుకె ప్రకారం చూస్తే… ప్రోస్టేట్ క్యాన్సర్ లో వివిధ రకాలు ఉన్నాయి. కామన్ గా వచ్చేది కార్సినోమా. ఇంకా మిగిలిన రకాలు కూడా ఉన్నాయి వాటి కోసం కూడా చూసేద్దాం.

  • ప్రోస్టేట్ యొక్క అడెనోకార్సినోమా. ప్రోస్టేట్ గ్లాన్డ్ మరియు ట్యూబ్స్ లో ఇది మొదలవుతుంది.
  • ప్రోస్టేట్ యొక్క ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా లో రావచ్చు.
  • ప్రోస్టేట్ Squamous cell carcinoma
  • స్మాల్ సెల్ ప్రోస్టేట్ క్యాన్సర్

ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే మిగిలిన శరీర భాగాలకు కూడా ప్రమాదమా…?

అవును దురదృష్టవశాత్తూ ప్రోస్టేట్ క్యాన్సర్ మిగిలిన శరీర భాగాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిని అడ్వాన్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. దీనికి అర్థం ఏమిటంటే ప్రోస్టేట్ గ్లాండ్ లో వచ్చిన క్యాన్సర్ మిగిలిన శరీర భాగాలు కి స్ప్రెడ్ అవ్వడం. దీని వలన ఏమవుతుందంటే ఎముకల నొప్పి, విపరీతమైన నీరసం, అనారోగ్యంగా ఉండడం, వివరించలేని బరువు తగ్గడం వంటి లక్షణాల్ని మనం చూడొచ్చు. కొన్ని కొన్ని సార్లు అయితే క్యాన్సర్ వచ్చిన చోటె పలు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
Weight Loss snacks : వీటిని తింటే బరువు తగ్గుతారట..
కార్తీక గిరిధర్ ఎండి మాయో క్లినిక్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సెల్స్ శరీరంలో ఏ భాగానికైనా స్ప్రెడ్ కావచ్చు. ఎక్కువ లింప్ నోడ్స్ మరియు ఎముకలకి ఈ సమస్య కలిగే అవకాశం ఉంది. ప్రోస్టేట్ లో ట్యూమర్ కి సెల్స్ దూరంగా వెళ్లి బ్రేక్ అయినప్పుడు ఇది సంభవిస్తుందని డాక్టర్ అంటున్నారు.

ఈ లక్షణాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త :

అడ్వాన్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ లో లక్షణాలు ఒకేలా ఉండవు. ఏ విధంగా అది స్ప్రెడ్ అవుతోంది..?, ఎలాంటి సమస్య వస్తాయి అనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. కానీ ట్యూమర్ కాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీని మూలంగా కాళ్ళ మీద వాపుని మనం గమనించవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ లింప్ నోడ్స్ ని ఎఫెక్ట్ చేస్తే దాని వల్ల కాలి మీద వాపు వస్తుందని క్యాన్సర్ రీసెర్చ్ చెబుతోంది. లింప్ నోడ్స్ అనేవి చిన్నగా బీన్ ఆకారంలో ఉంటాయి. ప్రతి శరీర భాగంలో కూడా ఇవి ఉంటాయి. ఒకవేళ కనుక లింప్ నోడ్స్ కి క్యాన్సర్ వలన ఎఫెక్ట్ కలిగితే కాలిపై వాపులు వస్తాయి.

cancer treatment

అసలు ఎందుకు వాపు వస్తుంది..?

క్యాన్సర్ వస్తే ఎందుకు కాళ్ళ మీద వాపులు వస్తాయి ఈ విషయం చూస్తే… క్యాన్సర్ రీసెర్చ్ యూకే చెబుతున్న దాని ప్రకారం క్యాన్సర్ సెల్స్ లింప్ ఫ్లూయిడ్ ని అడ్డుపడతాయి. దీని మూలంగా వాపులు వస్తాయి. కేవలం ఇది కాళ్ల మీదే కాకుండా వివిధ భాగాలలో అయినా సరే రావచ్చు. ఈ స్వెలింగ్ ఎలా ఉంటుందంటే సులువుగా మనం దానిని వేళ్ళతో జరపచ్చు. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. వేళ్ళతో నొక్కితే గుంతలు పడకపోవచ్చు అని క్యాన్సర్ రీసెర్చ్ యుకె చెబుతోంది.

ఈ సమస్య వస్తే మనం అసలు ఏం చేయాలి…?

ఒకవేళ కనుక ఈ సమస్య ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఈ కాన్సర్ కనుక వస్తే ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఇది ఎముకలకి, లివర్ కి, ఊపిరితిత్తులకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇంకో ముఖ్యమైన విషయంని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే కాళ్ళ మీద వాపు వస్తే అది ప్రొస్టేట్ క్యాన్సర్ మాత్రం కాదు. వాపులు వెనక మిగిలిన కారణాలు కూడా ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా గమనించడం మంచిది.

ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ఈ లక్షణాలు కూడా కనబడతాయి :

కొన్ని రకాల యూరినరీ లక్షణాలను కూడా మనం గమనించవచ్చు. వాటి గురించి కూడా చూద్దాం.

  1. ఎక్కువ సార్లు మూత్రం రావడం ముఖ్యంగా రాత్రిపూట మూత్రం ఎక్కువ రావడం.
  2. యూరిన్ పాస్ చేసేటప్పుడు కష్టంగా అనిపించటం.
  3. యూరిన్ కి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉండటం లేదా తక్కువ యూరిన్ రావడం.
  4. అదే విధంగా సెక్స్‌లో పాల్గొనడం కష్టంగా ఉండడం.
  5. యూరిన్‌లో నుంచి రక్తం రావడం లేదా సెమెన్ నుంచి రక్తం రావడం.

ఎవరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది..?

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాని ప్రకారం అందరు పురుషులు కూడా రిస్క్ లో ఉన్నట్లే. ముఖ్యంగా వయస్సు బట్టి వస్తుంది. ఎంత వయసు పెరిగితే అంత ఎక్కువ రిస్కు ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు లేక పోవడం, సరైన జీవన విధానం లేక పోవడం, ధూమపానం, మద్యపానం కారణంగా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని డాక్టర్లు అంటున్నారు.
Relationship Tips : మా ఆయన రొమాన్స్ విషయంలో నాదే తప్పంటున్నాడు..
ఎవరు టెస్ట్ చేయించుకోవాలి..?

  • 50 లేదా అంతకంటే వయస్సు ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇటువంటి వాళ్లకి మధ్యస్తంగా ప్రమాదం వున్నా కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది. .
  • 45 ఏళ్లు లేదా అంతకంటే వయసు ఎక్కువ వుంది రిస్క్ ఎక్కువగా ఉంటే టెస్ట్ చేయించుకోవాలి.
  • 40 కంటే ఎక్కువ ఉన్న వారు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. మీకు కనుక ఏమైనా లక్షణాలు కనబడితే టెస్ట్ చేయించుకోవడం మంచిది దానితో బయటపడొచ్చు. లేదంటే అనవసరంగా సతమతమవ్వాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here