Home తెలుగు News ఆరోగ్యం coconut water: షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చా.. – what are the benefits of drinking coconut water know here disadvantages too

coconut water: షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చా.. – what are the benefits of drinking coconut water know here disadvantages too

0
coconut water: షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చా.. – what are the benefits of drinking coconut water know here disadvantages too

[ad_1]

వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన లక్షణం కొబ్బరి నీటిలో ఉంది. వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి దాహం అధికంగా వేయడం సాధారణ విషయమే. దీంతో చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. అయితే చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే కూల్ డ్రింక్స్ తాగటం ఆరోగ్యపరంగా అంత శ్రేయస్కరం కాదు. అయితే సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే కొబ్బరి నీరు సేవించటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవిలో శరీరానికి కొబ్బరినీటి వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీరు తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ముఖంపై మచ్చలున్నాయా.. బంగాళాదుంపతో ఇలా చేయండి..
మరోవైపు కొబ్బరినీరు శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలోని కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలు బలోపేతం చేస్తాయి. కడుపులో మంట అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో భాదపడేవారు తరచూ కొబ్బరి నీరు తాగితే మంచిది. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటును తగ్గిస్తుంది. కొబ్బరినీటిలో సహజ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి.

కొబ్బరినీటిలో ఉండే సహజ ఎలక్ట్రోలైట్‌ మిమ్మల్ని రిఫ్రెష్‌గా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరం సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి బయటపడాలంటే కొబ్బరి నీరు తాగడం మంచిది. అందువల్ల వేసవిలో పండ్ల రసాలకు బదులు కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎసిటమైనోఫెన్ వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగవుతుంది.
ముఖానికి నిమ్మరసం పెట్టొచ్చా..
బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరినీరు బాగా ఉపయోగపడతాయి. సెల్ఫ్ న్యూట్రిషన్ డేటా ప్రకారం, ఒక కప్పు కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఫైబర్ మరియు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్ , సోడియం వంటి మినరల్స్ ఆరోగ్యకరమైన మోతాదుతో పాటు 46 కేలరీలు ఉంటాయి. వేసవి తాపంలో కూల్ డ్రింక్ కోసం తహతహలాడే ఫిట్‌నెస్ ప్రేమికులందరికీ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరిలో ఉండే సైటోకినిన్స్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. కొబ్బరి నీరు వ్యాయామం తర్వాత తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి మన ఆరోగ్యానికి, చర్మానికి చాలా ఉపయోగకరంగా చెప్పవచ్చు. కొబ్బరిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో 95 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉండదు.

★ కొబ్బరినీటితో చర్మ సమస్యలు దూరం

ఎండాకాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోంటారు. చర్మంపై టాన్.. డ్రై స్కీన్, మంట, దద్దుర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ముఖంపై వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి మొటిమల మీద కాస్త సమయం పెట్టాలి.

ఎండాకాలంలో ముఖం నిర్జీవంగా కనిపించేలా పొడి చర్మం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు కొబ్బరి నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సహజ చక్కెరతో పొడిని తొలగించవచ్చు. సమ్మర్ స్కిన్ కేర్ కోసం టోనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరి నీళ్లను స్ప్రే బాటిల్‌లో తీసుకుని అందులో రోజ్ వాటర్ కలపాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ టోనర్‌ని ముఖంపై స్ప్రే చేయండి.

డయాబెటీస్

వేసవిలో టానింగ్ సమస్య సర్వసాధారణం. టానింగ్ లేదా సన్ బర్న్ తొలగించడానికి ముఖానికి కొబ్బరి నీళ్లతో చేసిన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. దీని కోసం ముల్తానీ మిట్టిని తీసుకుని, కొబ్బరి నీళ్లు అవసరాన్ని బట్టి కలపాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంపై నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు కలపాలి. ఇందులో చందనం పొడిని కూడా కలపవచ్చు. ఈ పేస్ట్‌ను సుమారు 10 నిమిషాలు అప్లై చేసిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

★ కొబ్బరినీటితో శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయా?

☛ షుగర్‌ (మధుమేహం)తో బాధపడేవారు కొబ్బరినీరు తాగటం వల్ల మేలు కలుగుతున్నప్పటికీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కొబ్బరినీటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నవారు కొబ్బరినీటిని తక్కువగా తీసుకుంటే మేలు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు కొబ్బరి నీరు తాగేముందు వైద్యుని సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

☛ మీకు అధిక రక్తపోటు లేదా ఇతర అనారోగ్యాలు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్నవారిలో కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించవచ్చని ప్రాథమిక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒక వేళ మీరు ఇప్పటికే రక్తపోటు మందులు తీసుకుంటున్నట్లయితే కొబ్బరి నీళ్ల వల్ల సమస్యలు రావచ్చు. రక్తపోటు మరీ తగ్గినా సమస్యే. కాబట్టి, వైద్యుడి సూచన లేకుండా కొబ్బరి నీళ్లను తాగొద్దు.
ఇలా చేస్తే మెడనొప్పి తగ్గుతుందట..
☛ మీకు వారం రోజుల్లో ఏదైనా శస్త్ర చికిత్స లేదా సర్జరీ ఉన్నట్లయితే కొబ్బరి నీరు తాగొద్దు. కొబ్బరి నీటిలో ఉండే అధిక పోటాషియం రక్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సర్జరీకి ముందు కొబ్బరి నీటిని తాగకపోవడమే ఉత్తమం అని క్లీవ్‌ల్యాండ్ క్లీనిక్ చెబుతోంది.

☛ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు లేదా ACE ఇన్హిబిటర్లను తీసుకునే వారు కూడా కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here