Home తెలుగు News ఆరోగ్యం healthy breakfast, Best Breakfast : ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే అందంగా కనిపిస్తారట.. – healthy breakfast smoothie know here making process

healthy breakfast, Best Breakfast : ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే అందంగా కనిపిస్తారట.. – healthy breakfast smoothie know here making process

0
healthy breakfast, Best Breakfast : ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే అందంగా కనిపిస్తారట.. – healthy breakfast smoothie know here making process

Best Breakfast : మహమ్మారి పీక్‌లో ఉన్న టైమ్‌లో రీస్ విథర్‌స్పూన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ స్మూతీని ఎలా తయారు చేయాలో చూపించింది. గత 9 సంవత్సరాల నుంచి ఈమె రోజూ ఆ స్మూతీని తాగుతున్నట్లు తెలిపింది. ఇందులో కూరగాయలు ఉన్నాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా దీనిని తీసుకుంటా అని తెలిపింది. ఉదయం 10 లేదా 11 గంటలకు తీసుకుంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆకలి ఉండదు. మరి దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ స్మూతీ రెసిపీ

breakfast for health

మంచి బ్రేక్‌ఫాస్ట్

కావల్సిన పదార్థాలు..

  • 2 హెడ్స్ రొమైన్ పాలకూర
  • అరకప్పు బచ్చలి కూర
  • కప్పు కొబ్బరి నీరు
  • ఒక అరటిపండు
  • ఒక ఆపిల్
  • ఒక పియర్
  • ఒక నిమ్మకాయ
  • కొద్దిగా సెలెరీ
  • ఆల్మండ్ బటర్
  • పై రెండు కూడా ఆప్షనల్..

ఎలా తయారు చేయాలి..

స్టెప్ 1 : పాలకూరను కట్ చేసి బ్లెండర్‌లో వేసే ముందు కడిగి వడగట్టండి. ఇప్పుడు బచ్చలికూర, కొబ్బరి నీరు, అరటిపండు, ఆపిల్, పియర్, నిమ్మకాయ, ఇతర పదార్థాలను కూడా బ్లెండర్‌లో వేయండి. ఆపిల్, పియర్స్‌, నిమ్మకాయ తొక్కు తీసి కట్ చేయండి.

స్టెప్ 2 : అన్ని పదార్థాలను కలిపి మిక్సీ పట్టండి. ఇవన్నీ కూడా మంచి జ్యూస్‌లా అవ్వాలి.

స్టెప్ 3 : ఓ గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి గ్రీన్ స్మూతీలో వేయండి.

how to make smoothie

స్మూతీ ఎలా చేయాలంటే..


స్టెప్ 4 :
కావాలనుకుంటే ఇందులో కొద్దిగా సెలరీ, ఆల్మండ్ బటర్‌ని యాడ్ చేసి ఎంజాయ్ చేయండి.

వీటితో పాటు నీటిని తాగడం, సరైన సమయంలో నిద్రలేవడం, పడుకోవడం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం లాంటివి చేస్తుండాలి. అదే విధంగా శరీరానికి తగినంత వ్యాయామం కూడా అవసరం. అప్పుడే అనుకున్న విధంగా బరువు తగ్గించుకుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గడంపైనే ఫోకస్ చేస్తారు. కానీ, దీంతో పాటు తాము ఆరోగ్యంగా ఉన్నారా.. లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

జంక్‌ఫుడ్‌‌కి దూరంగా ఉండాలి. వీలైనంతగా ఒత్తిడిని దరిచేరనివ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా రోజూ తాజా ఆహారం తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటుండడం వల్ల శరీరానికి అవసరమైనన్నీ పోషకాలు అందుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here