Home తెలుగు News ఆరోగ్యం heart beat, Heart Problems : ఇలా చేస్తే గుండెని ఆరోగ్యంగా ఉంచొచ్చట.. – how to lower your heart rate know here ways

heart beat, Heart Problems : ఇలా చేస్తే గుండెని ఆరోగ్యంగా ఉంచొచ్చట.. – how to lower your heart rate know here ways

0
heart beat, Heart Problems : ఇలా చేస్తే గుండెని ఆరోగ్యంగా ఉంచొచ్చట.. – how to lower your heart rate know here ways

ఎమోషనల్‌గా ఒత్తిడికి గురవడం వంటి మొదలైన కారణాల వల్ల హార్ట్ రేట్ ఎంతో అకస్మాత్తుగా పెరిగిపోతుంది. మరి ఏ విధంగా హార్ట్ రేట్‌ను తగ్గించుకోవాలి..? ముఖ్యంగా మీరు ఈ సమస్యతో బాధ పడుతుంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా దీన్ని పూర్తిగా చూసేయండి.

డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, గైడెడ్ టెక్నిక్స్‌ను తప్పకుండా పాటించాలి. ఇలాంటి టెక్నిక్స్‌ను పాటిస్తే కచ్చితంగా మీరు రిలాక్స్ అవుతారు. అంతే కాకుండా చాలా ప్రశాంతతను పొందుతారు. ఒకవేళ మీరు ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తే మంచి వాతావరణం ఉండేటువంటి ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్లడం లేక గట్టిగా ఊపిరి పీల్చుకుని కాళ్లు చేతులను స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వండి.

ఒత్తిడి పూర్తిగా తగ్గడానికి వేడి నీటితో స్నానం చేయండి, దాంతో మీ మైండ్‌తో పాటు బాడీ పూర్తిగా రిలాక్స్ అవుతాయి. యోగాలో ఉండేటువంటి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, టెక్నిక్స్ వంటివి చేయడం వలన ఉపయోగం ఉంటుందని గమనించాలి. ఈ విధంగా మీరు కొన్ని రకాల చర్యలు తీసుకుంటే తప్పకుండా హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది.

Breast Cancer : బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ ఎవరు కచ్చితంగా చేయించుకోవాలంటే..
వీటన్నిటితో పాటుగా మీ జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తుంచుకోండి. పైగా ఫిజికల్ యాక్టివిటీ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. అయితే వీటన్నిటినీ పాటించడం వల్ల మీకు టెంపరరీగా ప్రయోజనం అనేది లభిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా మీ హార్ట్ రేట్ తక్కువగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి అంటే వీటన్నిటిని క్రమం తప్పకుండా ప్రతి రోజు పాటించండి.

tips for heart health

గుండె ఆరోగ్యానికి టిప్స్

వ్యాయామాలు :

ఎంతో సులువైన, కీలకమైన వ్యాయామాలు చేయడం వలన మీరు చాలా ఉపయోగాలను పొందుతారు. ముఖ్యంగా హార్ట్ రేట్ ను తగ్గించడానికి వ్యాయామాలు చాలా సహాయపడతాయి అని కొన్ని రకాల పరిశోధనలలో తేలింది. ముఖ్యంగా యోగా, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అనేది హార్ట్ రేట్‌ను తగ్గించడానికి సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

హైడ్రేటెడ్ :

ఎప్పుడైతే మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందో అప్పుడు మీ గుండె పని తీరు సరైన విధంగా జరగదు. పైగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దాంతో బ్లడ్ ఫ్లోలో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హార్ట్ రేట్‌ని తగ్గించుకోవాలి అనుకుంటే తప్పకుండా హైడ్రేటెడ్ గా ఉండాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల వరకు నీళ్లు తాగాలి లేదా మంచి నీటితో పాటుగా ఎలాంటి లిక్విడ్స్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా లిక్విడ్స్ తీసుకోవడంతో మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవ్వకుండా ఉంటుంది. దాంతో పాటుగా హార్ట్ రేట్ తక్కువగా ఉంటుంది.

Also Read : Kidney Problems : నోటి దుర్వాసన వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లేనా..

ఆల్కహాల్ :

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురి అవుతారు అని కొన్ని రకాల పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ రేటు పెరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది శరీరానికి టాక్సిన్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. దాంతో గుండె, శరీర పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి హార్ట్ రేట్ పెరగకుండా ఉండాలి అంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.

న్యూట్రీషన్స్, బ్యాలెన్స్డ్ డైట్ :

ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరానికి మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి డైట్ లో భాగంగా తప్పకుండా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్స్, తృణ ధాన్యాలు వంటి మొదలైన ఆహార పదార్థాలను వీలైనంత తీసుకోవాలి. వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తో పాటు హెల్తీ ఫ్యాట్స్‌ను తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది.

దాంతో గుండె రక్తాన్ని పంప్ చేసుకోవడం సులువు అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి చేపలు, నట్స్ లేదా వివిధ ధాన్యాలు తీసుకోవాలి. అంతే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటుగా డైటరీ ఫైబర్ కూడా అవసరమే.

సరైన నిద్ర :

దీర్ఘకాలికంగా సరైన నిద్రను మీరు పొందకపోతే శరీరం ఒత్తిడికి గురి అవుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. అందువలన ప్రతి రోజు ఉండే స్లీప్ సైకిల్ చెడిపోవడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Statins : ఈ మందులని సడెన్‌గా ఆపేస్తే గుండెనొప్పులు వస్తాయట.. జాగ్రత్త..

హెల్దీ బాడీ వెయిట్ :

సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం వలన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది, అంటే అధిక బరువు ఉండడంతో మరింత జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక హెల్దీ బాడీ వెయిట్ కు సంబంధించిన పరిశోధనలు కూడా ఇవే చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించి హార్ట్ రేట్‌ని కంట్రోల్ లో ఉంచుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here