Home తెలుగు News ఆరోగ్యం mango health benifits: మామిడి కాయ జీడితో స్ట్రెచ్చ్‌ మార్క్స్‌ మాయం… – uses of mango tree leaves and mango tree bark

mango health benifits: మామిడి కాయ జీడితో స్ట్రెచ్చ్‌ మార్క్స్‌ మాయం… – uses of mango tree leaves and mango tree bark

0
mango health benifits: మామిడి కాయ జీడితో స్ట్రెచ్చ్‌ మార్క్స్‌ మాయం… – uses of mango tree leaves and mango tree bark

[ad_1]

మన భారత దేశ సంస్కృతిలో మామిడి చెట్టుకు ప్రత్యేక స్థానముంది. హిందువులు మామిడి చెట్టుని దేవతల స్థానంలా కొలుస్తారు. ఇంట్లో పూజైనా, పెళ్లైనా, పండగైనా మామిడాకులతో గృహాన్ని అలంకరించడం మన సంప్రదాయం. మామిడి చెట్టుకి, మామిడి కాయకు ఎందుకు అంత విశిష్టత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

మామిడికి 4000 ఏళ్ల నాటి చరిత్ర

మామిడి చెట్టును కాంస్యం యుగంలోనే గుర్తించారు.. అంటే సుమారు 4000 ఏళ్ల క్రితం. వాస్తవానికి తూర్పు భారతదేశంలో కనుగొన్న మామిడి చెట్టుని భౌద్ధ గురువులు.. ఆగ్నేయాసియా దేశాలకు పరిచయం చేశారు. తర్వాత పోర్చుగీస్ వాళ్లు ఆఫ్రికాకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మామిడి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

మామిడి చెట్టులోని ప్రతి భాగము ఏదో రకంగా మనం ఉపయోగిస్తూనే ఉంటాం.. దార్మిక కార్యక్రమాల నుంచి ఆరోగ్య చిట్కాలలోనూ… మనం ఎక్కువగా మామిడి కాయ అంటే ఇష్టపడుతూ ఉంటాం.. మామిడిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

మామిడి కాయ జీడితో స్ట్రెచ్చ్‌ మార్క్స్‌ మాయం...

రక్తహీనతను నివారిస్తుంది: మామిడిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తగినంత పరిమాణంలో మామిడిని తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మామిడిలో ఉండే విటమిన్ సి ఐరన్ అబ్సర్బ్‌ చేసుకునే కెపాసిటీ పెంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణవ్యవస్థలో లోపాలు అనారోగ్యానికి ప్రధాన కారణం. మామిడిలో పీచు, పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల మలబద్ధకం, పేగులలో మంట తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మామిడలో.. విటమిన్ సి కాకుండా ఫోలేట్, జింక్, విటమిన్ బి6 ఉన్నాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: మామిడి గుజ్జు ఎందుకు పసుపు రంగులో ఉంటుందో మీకు తెలుసా..? దీనిలో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మామిడి కాయలోనే కాదు.. మామిడి ఆకుల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి.

మామిడి కాయ జీడితో స్ట్రెచ్చ్‌ మార్క్స్‌ మాయం...

రక్తపోటును తగ్గిస్తుంది: మామిడి ఆకుల రసంలో యాంటీహైపెర్టెన్సివ్ లక్షణాలు ఉంటాయి. మామిడి ఆకులతో చేసిన టీని తీసుకవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

మధుమేహం నియంత్రణలో ఉంటుంది: లేత మామిడి ఆకుల్లో టానిన్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మామిడి ఆకుల రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

నోటి సమస్యలకు చెక్‌: నోరు శుభ్రంగా లేక పోవడం, చిగుళ్ల వ్యాధులు నోటి దుర్వాసనకు దారి తీస్తాయి. కొన్ని మామిడి ఆకులను శుభ్రం చేసి, పసుపు రంగు వచ్చే వరకు నీటిలో మరిగించి, కాస్త ఉప్పు వేసి.. ఆ నీటితో నోరు శుభ్రం చేసుకుంటే నోటి నుంచి దుర్వాసన రాదు. ఇది చిగుళ్ల సమస్యకూ సహాయపడుతుంది.

ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది: మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. మామిడి ఆకుల రసం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌‌ తొలగుతాయి.

కడుపుని క్లీన్: కొన్ని మామిడి ఆకులను గోరువెచ్చని నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవడం వల్ల పొట్టను శుభ్రపరుస్తుంది, శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపుతుంది.

పోషకాల గని..

  • మామిడి కాయ, మామిడి ఆకే కాదు.. ఆ చెట్టు మొత్తం పోషకాల గని..
  • మామిడి బెరడు: ఎండిన మామిడి బెరడు పొడిని తీసుకుంటే.. అతిసారం సమస్య నుంతి ఉపశమనం లభిస్తుంది.
  • మామిడి జిగురు: మామిడి చెట్టు బెరడు నుంచి సేకరించిన జిగురును కాళ్ల పగుళ్లకు రాస్తే మీ పాదాలు ముందులో అందంగా తయారవుతాయి.
  • మామిడి రసము: మామిడికాయ కోసిన తర్వాత వచ్చే రసాన్ని.. తేనెటీగ కుట్టిన చోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • మామిడి జీడి: మామిడి జీడి నుంచి చేసే వెన్నను చర్మంపై పూస్తే.. వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. స్టేచ్ మార్క్‌ను తొలగిస్తుంది. మచ్చలు, ముడుతలు మాయమవుతాయి. మామిడి జీడి రసం.. బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here