Home తెలుగు News ఆరోగ్యం no tobacco day: World No Tobacco Day : పొగ తాగడం మానేసిన వారికి కూడా కాన్సర్ రిస్క్ ఉంటుందా.. – risk of lung cancer in former smokers know here all

no tobacco day: World No Tobacco Day : పొగ తాగడం మానేసిన వారికి కూడా కాన్సర్ రిస్క్ ఉంటుందా.. – risk of lung cancer in former smokers know here all

0
no tobacco day: World No Tobacco Day : పొగ తాగడం మానేసిన వారికి కూడా కాన్సర్ రిస్క్ ఉంటుందా.. – risk of lung cancer in former smokers know here all

[ad_1]

పొగతాగేవారిపై ప్రభావం.

ఇండియాలో అన్ని కాన్సర్ల కంటే ఎక్కువగా పొగాకు సంబంధిత కాన్సర్స్‌తో మరణాలు పెరుగుతున్నాయి. చాలా మంది పొగతాగేవారు… లంగ్ కాన్సర్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఉదాహారణకు ఓ వ్యక్తి తనకు ఆ వ్యాధి వచ్చే ప్రమాదం 10 శాతం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇక్కడ ప్రమాదానికి సంఖ్యని కేటాయించడం, అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ఓ వ్యక్తి 10 శాతాన్ని ఎక్కువ అనుకోవచ్చు.
No Tobacco Day : శవాల దగ్గరకి వెళ్ళినప్పుడు పొగతాగితే మంచిదా..
పొగ తాగి మానేసిన వారికి..

పొగ తాగి మానేసిన వారు కాన్సర్ల విషయానికి వస్తే అధ్యయనం పరంగా అంతగా శ్రద్ధ తీసుకోలేదు. ఓ వ్యక్తి గత 5-10 సంతవ్సరాలుగా క్రమం తప్పకుండా ధూమపానం, పొగాకును తీసుకుని మానేసినా ఇప్పుడు వచ్చే హాని నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ధూమపానం ఎన్ని రోజులు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. ఇలాంటి విషయాలు అన్ని నిపుణులకి తెలియజేసి ప్రమాదాల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లక్షణాలు..

  • లంగ్ కాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా మంచిది. చాలా మందికి ఈ లక్షణాల గురించి తెలియదు. ఇండియాలో దాదాపు 90 శాతం కేసులు చివరి దశలో గుర్తించబడుతున్నాయి. ఎందుకంటే లంగ్ కాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా కష్టం. దీంతో ఈ వ్యాధులను చాలా అరుదుగా నయమవుతాయి.
  • లంగ్ కాన్సర్స్ ఉంటే రోగికి రక్తంతో కూడిన దగ్గు వస్తుంది. ఇది భయంకరమైన ఓ లక్షణం. ఇలాంటి టైమ్‌లో తప్పనిసరిగా వైద్యుల సాయాన్ని కోరాలి. అదే విధంగా ఊపిరిత్తుల కాన్సర్ ఎక్కువగా వచ్చే రకం అడెనోకార్సినోమా. ఈ కణుతులు ఊపిరితిత్తుల బయటి భాగాలలో ఏర్పడతాయి. దీంతో పేషెంట్స్‌కి రోగులకు కొద్దిగా దగ్గు, అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. వీటిని సాధారణ జలుబుగా తీసుకోవద్దు. వారం కంటే ఎక్కువ రోజులు దగ్గు వేధిస్తుంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం.

మామిడిపండు తిని నీరు తాగుతున్నారా..
స్క్రీనింగ్ ప్రాముఖ్యత..

ఊపిరితిత్తుల కాన్సర్ చికిత్సను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. పొగతాగని వారు, తాగి మానేసినవారు హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌ని కలిసినప్పుడు కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే స్క్రీనింగ్ టైమ్‌లో ధూమపానం చేయని వారికి కూడా లంగ్ కాన్సర్ వంటి సమస్యల్ని గుర్తిస్తున్నారు. జపాన్, యూఎస్, కొరియా వంటి దేశాల్లోనూ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.

స్క్రీనింగ్ అంటే సాధారణ వ్యక్తులకు ఆ వ్యాధి లక్షణాలు లేనప్పుడు కూడా వ్యాధి లక్షణాలు లేనప్పుడు కూడా వ్యాధిని పరీక్షించడం. పరిస్థితిని ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

లంగ్ కాన్సర్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎవరు స్క్రీనింగ్ చేయించుకోవాలంటే..

  • 20 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం స్మోక్ చేసినవారు.
  • 30, 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు.
  • ధూమపానం మానేసి 10 నుంచి 15 సంవత్సరాలు అయినవారు కూడా స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పీరియడ్స్ ముందు ఈ 7 సమస్యలు వస్తాయట.. జాగ్రత్త..
ట్రీట్ మెంట్ గురించి..

లంగ్ కాన్సర్ ట్రీట్‌మెంట్ అనేది ముందుగానే సమస్యని గుర్తించి మొదలుపెడితే ప్రభావవంతంగా సమస్యను దూరం చేస్తుంది. అయినప్పటికీ, లంగ్ కాన్సర్ ట్రీట్‌మెంట్ అనేది కాస్తా కష్టమైన ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఛాతిపై పెద్ద కోతలు పెట్టి సాంప్రదాయ శస్త్రచికిత్స చేస్తారు. ఇది చాలా కష్టంగానే ఉంటుంది. పేషెంట్స్ బలహీనంగా ఉన్నప్పుడు దీనిని భరించడం కష్టం. డా విన్సీ సిస్టమ్‌ ద్వారా రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ వంటి కనిష్ట ఇన్వాసివ్ విధానం సురక్షితమైనదిగా పరిగణిస్తారు. RAS అనేది చిన్న కోతలు, తక్కవ బ్లడ్ బ్లీడింగ్‌తో జరుగుంది. దీని ద్వారా పేషెంట్స్‌కి అంత ఇబ్బందిగా ఉండదు. సిస్టమ్ 3D విజువలైజేషన్ సామర్థ్యం కారణంగా థొరాసిక్ సర్జన్స్ ఈ ట్రీట్‌మెంట్‌ని ిర్వహిస్తారు. దీని తర్వాత అతి తక్కువ టైమ్‌ వరకే ఆస్పత్రిలో ఉండడం, తక్కువ సమస్యలు, వేగంగా కోలుకోవడం, మచ్చలు కూడా ఉండకపోవడం వంటి దీని వల్ల లాభాలు.

పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది భారతీయులను చంపుతోంది. పొగాకుతో కలిగే హాని సమాచారం గురించి అందరికీ తెలిసినా యువకులు ఇప్పటికీ ఈ అలవాటుని దూరం చేసుకోలేకపోతున్నారు. ఇకనైనా దీని బారన పడకుండా, పొగాకును ఏ రూపంలో కూడా తీసుకోకపోవడం కాన్సర్ వంటి భయంకరమైన రోగాలను దూరం చేయడం వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.

-Dr Saravana Rajamanickam, MBBS, MS, Mch(Lung Cancer Specialist)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here