Home తెలుగు News సినిమా ravi teja: అన్నయ్యకు తమ్ముడి తోడు.. రవితేజకు బంపర్ ఆఫర్! పారితోషికం ఎంతో తెలుసా..? – ravi teja remuneration for screen share with chiranjeevi for his upcoming movie

ravi teja: అన్నయ్యకు తమ్ముడి తోడు.. రవితేజకు బంపర్ ఆఫర్! పారితోషికం ఎంతో తెలుసా..? – ravi teja remuneration for screen share with chiranjeevi for his upcoming movie

0
ravi teja: అన్నయ్యకు తమ్ముడి తోడు.. రవితేజకు బంపర్ ఆఫర్! పారితోషికం ఎంతో తెలుసా..? – ravi teja remuneration for screen share with chiranjeevi for his upcoming movie

[ad_1]

ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో పోటీ పడుతూ బాక్సాఫీస్ దుమ్ము దులిపిన మాస్ మహారాజ్ రవితేజ.. ఆ తర్వాత కొన్నేళ్లు హిట్స్ లేక డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే మాస్ ఇమేజ్ ఉన్న ఈ హీరోని క్రాక్ సినిమా తిరిగి ట్రాక్ ఎక్కించింది. దీంతో తిరుగులేని వేగంతో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు రవితేజ. విలక్షణ కథలను ఎంచుకుంటూ కెరీర్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల చిరంజీవి సినిమాలో న‌టించే బంపర్ ఆఫ‌ర్ కూడా
ఆయనకు దక్కిందనే టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి సైతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగం కాబోతున్నారని సమాచారం. చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం రవితేజను సంప్రదించారట డైరెక్టర్ బాబీ. రోల్ గురించి చెప్పి ఆయనను మెప్పించారట. పైగా చిరంజీవితో తెర పంచుకునే అరుదైన అవకాశం కావడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.

అయితే రవితేజ చేయబోతున్న ఈ రోల్ కోసం ఆయనకిచ్చే రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే ఉండబోతోందనేది ఇన్‌సైడ్ టాక్. ఏకంగా 7 కోట్లు పారితోషికంగా ముట్టజెప్పనున్నారని అంటున్నారు. సో.. ఈ రేంజ్ క్యాష్ ఆఫర్ చేస్తున్నారంటే చిరంజీవి- బాబీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ రోల్ ఎంత ప్రాధాన్యతతో కూడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

గతంలో చిరంజీవితో తెర పంచుకునే అనుభవం రవితేజకు ఉండనే ఉంది. చిరు హీరోగా వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో రవితేజ, వెంకట్‌లు తమ్ముళ్లుగా నటించి మెప్పించారు. సో.. మళ్ళీ ఇన్నేళ్లకు అదే చిరంజీవి- రవితేజ సింగిల్ స్క్రీన్‌పై కనిపిస్తారని తెలుస్తుండటం ఇరువురి అభిమానులను హుషారెత్తిస్తోంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here