Home తెలుగు News ఆరోగ్యం romance and monkeypox, Monkeypox : వామ్మో.. శృంగారంతో కూడా మంకీపాక్స్ వస్తుందట.. – what is link between monkeypox and sexually transmitted infection

romance and monkeypox, Monkeypox : వామ్మో.. శృంగారంతో కూడా మంకీపాక్స్ వస్తుందట.. – what is link between monkeypox and sexually transmitted infection

0
romance and monkeypox, Monkeypox : వామ్మో.. శృంగారంతో కూడా మంకీపాక్స్ వస్తుందట.. – what is link between monkeypox and sexually transmitted infection

[ad_1]

Monkeypox : నిజానికి మంకీ పాక్స్‌కి సంబంధించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి. నిజానికి ఇది ప్రమాదకరమైన సమస్య అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. మంకీ పాక్స్ సమస్య మరియు అది ఎలా స్ప్రెడ్ అవుతుంది..? నిజానికి చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అయితే మంకీ పాక్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఇది వైరల్ జూనోటిక్ ఇన్ఫెక్షన్. ఇది స్మాల్ పాక్స్‌కి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చింది. ఒకవేళ కనుక మంకీ పాక్స్ వైరస్ కుటుంబం నుండి వచ్చింది. అంటే జ్వరం, తల నొప్పి, బ్యాక్ పెయిన్, కురుపులు వంటి లక్షణాలు కనపడతాయి. ఈ లక్షణాలు కనుక ఎవరిలోనైనా ఉన్నట్లయితే అది మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అని గుర్తించండి.

Also Read : Hair styles : పొట్టి జుట్టు ఉన్నవారు ఈ హెయిర్ స్టైల్స్ వేస్తే అద్దిరిపోద్ది అంతే..

ఈ మంకీ పాక్స్ సమస్య అనేది ఒక మనిషి మంకీ పాక్స్‌కి గురైతే వాళ్ళ నుండి మరొకరికి సోకుతుంది. లేదంటే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా కూడా ఈ మంకీ పాక్స్ సమస్య అనేది సోకడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చిందంటే వారికి దూరంగా ఉండటం మంచిది. డైరెక్ట్ కాంటాక్ట్ వలన ఈ సమస్య వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. లేదంటే లేనిపోని సమస్యలు మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇక మంకీ పాక్స్ వైరస్ స్ప్రెడ్ ఎలా అవుతుంది..?, ఒకరి నుండి మరొకరికి ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలంటే మరి ఇక ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా దాని కోసం కూడా చూసేయండి. ముందుగా క్లోజ్, డైరెక్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే ఏమిటి..? అనేది చూద్దాం. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాని ప్రకారం మంకీ పాక్స్ అనేది ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. క్లోజ్ పర్సనల్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కలిగినప్పుడు మంకీ పాక్స్ కనుక ఉన్నట్లయితే అది మరొకరికి కూడా సోకుతుంది.

మంకీ పాక్స్ బాడీ ఫ్లూయిడ్స్ నుండి ఒక మనిషి నుండి మరొక మనిషికి సోకుతుంది. అలానే ఇది ఓరల్, ఆనల్ సెక్స్, వాజీనల్ సెక్స్ వలన కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జెనిటల్స్ వల్ల కూడా ఇది సోకుతుంది వ్యాధి ఉన్న వాళ్ళని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, మసాజ్ చేయడం, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. ఇలా సోకడం వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యాధి బారిన పడిన వాళ్ళకి దూరంగా ఉండండి.

మంకీ పాక్స్ సమస్య అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ సమస్యా..?

మంకీ పాక్స్ సమస్య అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ సమస్యా అని కూడా చాలా మంది అనుమానం పడుతున్నారు. అయితే మరి దాని గురించి కూడా చూద్దాం. ఇప్పటికి నిపుణులకి దీని గురించి ఇంకా ఏ క్లారిటీ రాలేదు. కానీ మంకీ పాక్స్ వైరస్ నుండి కోలుకున్న తర్వాత వారాల పాటు వీర్యంలో ఇది వుంది అని ది లాన్సెట్ తాజా అధ్యయనం చెప్పింది. ఇక ఇది ఇలా ఉంటే ఒక పేషంట్ లో మంకీ వైరస్ ని కనుగొన్న 5-19 రోజుల తరవాత సెమెన్ సేంపిల్స్ ని తీసుకున్నారు. అప్పుడు రికవరీ అయినా తరవాత సెమెన్‌లో మంకీ వైరస్‌ని గుర్తించారు. అలానే ఇటలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లజారో స్పల్లంజాని (IRCCS) వైరాలజీ యొక్క లేబొరేటరీ పరిశోధకురాలు ఫ్రాన్సిస్కా కొలవిటా దాని ప్రకారం చూస్తే లక్షణాలు వచ్చిన కొన్ని వారాలకి సోకిన రోగుల వీర్యంలో మంకీపాక్స్ వైరస్ DNA ఉంటుందన్నారు.

మంకీపాక్స్ లక్షణాలు ఏంటంటే..

అలానే ఇటలీలోని లాజారో స్పల్లంజాని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఒక వ్యక్తిని పరీక్షించారు. అయితే ఈ వ్యక్తి మే మొదటి వారం మరియు రెండో వారంలో ఆస్ట్రేలియా వెళ్లారని తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి పురుషులతో మరియు కొంతమంది బయటి వారితో రతిలో పాల్గొన్నారని ఆ వ్యక్తే స్వయంగా చెప్పాడు. అలానే ఆ ప్రయాణంలో తాను చాలా మంది మగవాళ్లతో కలయికలో పాల్గొన్నారని.. సేఫ్‌గా కాదని తానే స్వయంగా చెప్పాడు. అయితే ఇలా కలయికలో పాల్గొనడం వలన ఆ వ్యక్తికి మంకీ పాక్స్ సమస్య వచ్చిందని తెలుస్తోంది. అలానే కేవలం ఈ మంకీ పాక్స్ రొమాన్స్ వలన మాత్రమే కాదు డైరెక్ట్ కాంటాక్ట్ వలన కూడా వస్తుంది అని వైద్యులు చెప్పడం జరిగింది.

బట్టలు, మంచం మరియు టవల్స్‌ని షేర్ చేసుకోవడం వల్ల కూడా మంకీ పాక్స్ వస్తుందా..?

బట్టలు, మంచం మరియు టవల్స్‌ని షేర్ చేసుకోవడం వల్ల కూడా మంకీ పాక్స్ సమస్య వస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం మంకీ సోకిన వ్యక్తి బట్టల్ని వాడడం వల్ల కూడా ఈ సమస్య కలుగుతుంది అని తెలుస్తోంది. వైరస్ సోకిన వ్యక్తి యొక్క మంచాన్ని షేర్ చేసుకోవడం, టవల్స్‌ని షేర్ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని తెలుస్తుంది. అయితే మంకీ పాక్స్ లక్షణాలు మొదలైనప్పటి నుంచి కూడా ఆ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి మంకీ పాక్స్ వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఈ వ్యాధి రెండు నుంచి మూడు వారాల పాటు మనుషుల శరీరం పై ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఇది ఇలా ఉంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం ఆ క్లబ్స్, ప్రైవేట్ మరియు పబ్లిక్ కలయిక పార్టీస్ వలన కూడా వస్తుంది. ఇంటిమేట్ జరిగే చోట్ల కూడా ఈ మంకీ పాక్స్ సమస్య వస్తుంది. ఎక్కువ మందితో శృంగారం లో పాల్గోవడం వంటి వాటి వలన కూడా మంకీ పాక్స్ సమస్య వస్తుంది.

Also Read : Couple Yoga : ఈ యోగా చేస్తే రొమాన్స్‌ బాగా చేస్తారట..

రెస్పిరేటరీ సెక్రీషన్స్ వల్ల కూడా మంకీ పాక్స్ సమస్య కలిగే అవకాశం ఉందా..?

సాధారణంగా ఈ మంకీ పాక్స్ సమస్య అనేది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల వస్తుంది అలాగే బాడీ ఫ్లూయిడ్స్ వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం రెస్పిరేటరీ సెక్రీషన్స్ వల్ల కూడా మంకీ పాక్స్ సమస్య కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని కోసం ఇంకా పూర్తిగా తెలియలేదు, రెస్పిరేటరీ సెక్రీషన్స్ వల్ల ఎంత వరకు ఈ వైరస్ వ్యాపిస్తుంది అనే దాని మీద క్లారిటీ అయితే ఇంకా లేదు అలానే రెస్పిరేటరీ సెక్రీషన్స్ వలన ఎలాంటి మంకీ పాక్స్ లక్షణాలు వస్తాయి అనేది కూడా తెలియలేదు. కానీ మంకీ పాక్స్ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కానీ ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Also Read : Cancer : ప్రొస్టేట్ కాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here