Home తెలుగు News సినిమా Singer Harini Family: సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం.. రైల్వేట్రాక్‌పై తండ్రి డెడ్ బాడీ.. ఈ మిస్టరీ వెనుక కారణాలేంటి? – singer harini father ak rao suspicious death at bengaluru

Singer Harini Family: సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం.. రైల్వేట్రాక్‌పై తండ్రి డెడ్ బాడీ.. ఈ మిస్టరీ వెనుక కారణాలేంటి? – singer harini father ak rao suspicious death at bengaluru

0
Singer Harini Family: సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం.. రైల్వేట్రాక్‌పై తండ్రి డెడ్ బాడీ.. ఈ మిస్టరీ వెనుక కారణాలేంటి? – singer harini father ak rao suspicious death at bengaluru

[ad_1]

ప్రధానాంశాలు:

  • సింగర్‌ హరిణి కుటుంబం అదృశ్యం
  • రైల్వేట్రాక్‌పై ఆమె తండ్రి డెడ్ బాడీ
  • కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న ఆ కుటుంబం గత వారం రోజులుగా కనిపించడం లేదు. వారి సెల్ ఫోన్స్ కూడా స్విచ్చాఫ్ వస్తుండటంతో బంధు వర్గాలు ఆందోళన చెందాయి. ఇంతలో హరిణి తండ్రి ఏకే రావు డెడ్ బాడీ బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై కనిపించడంతో అంతా షాకయ్యారు. ఏకే రావు డెడ్ బాడీ పరిశీలించిన బెంగళూరు పోలీసులు రెండు రోజుల క్రితమే ఆయన మరణించినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు.

అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఏకే రావుది మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఆ తర్వాత డెడ్ బాడీపై ఉన్న బలమైన గాయాలు చూశాక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఎవరైనా కొట్టి చంపేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

సుజనా ఫౌండేషన్ సీఈవోగా పని చేస్తున్న ఏకే రావు ఇలా అనుమానాస్పద మృతి చెందటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది హత్యనే అయితే.. ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆర్థిక లావాదేవీలే కారణమా? లేదంటే ఇంకేదైనా కోణముందా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. అసలు హరిణి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎందుకు వెళ్లింది? వారం రోజులుగా అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం సింగర్ హరిణితో ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? అనే వివరాలు తెలియరాలేదు.
ఏ ముహూర్తాన జగపతి బాబుతో అన్నానో కానీ..! వారం రోజుల్లో నా కొడుకు పోయాడు.. కోట శ్రీనివాస రావు ఎమోషనల్
ప్లేబ్యాక్ సింగర్‌‌గా, గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, క్లాసికల్‌ డ్యాన్సర్‌‌గా సినీ ఇండస్ట్రీలో హరిణి తన మార్క్ చూపించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో 3500కు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆమె ఆలపించిన పాటల్లో మురారి సినిమాలోని ఎక్కడ ‘ఎక్కడ ఎక్కడ ఉంది తారాకా’, గుండుంబా శంకర్‌ సినిమాలోని ‘ఏమంటారో నాకు నీకున్న ఇదిని’, ఘర్షణ సినిమాలోని ‘అందగాడ అందగాడ’ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here