Home తెలుగు News సినిమా Sir Movie: Dhanush: తెలుగులో ధనుష్ డైరెక్ట్ మూవీ.. ‘సార్’ ని రంగంలోకి దింపిన త్రివిక్రమ్.. – dhanush’s bilingual film sir launched by trivikram srinivas

Sir Movie: Dhanush: తెలుగులో ధనుష్ డైరెక్ట్ మూవీ.. ‘సార్’ ని రంగంలోకి దింపిన త్రివిక్రమ్.. – dhanush’s bilingual film sir launched by trivikram srinivas

0
Sir Movie: Dhanush: తెలుగులో ధనుష్ డైరెక్ట్ మూవీ.. ‘సార్’ ని రంగంలోకి దింపిన త్రివిక్రమ్.. – dhanush’s bilingual film sir launched by trivikram srinivas

[ad_1]

తమిళ హీరో ధనుష్ డైరెక్ట్ తెలుగు మూవీ ప్రారంభమైంది. ఇది తెలుగు, తమిళంలో రూపొందుతోన్న ద్విభాషా చిత్రం. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో సార్.. తమిళంలో వాతి అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీత అతిథుల మధ్య జరిగింది.

హీరోహీరోయిన్లు ధనుష్, సంయుక్త మీనన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ స్క్రిప్ట్ అందచేశారు. నిర్మాతలు డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్.కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. జి.వి. ప్ర‌కాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.

తెలుగులో ధనుష్‌కి ఇది డైరెక్ట్ మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అతని డబ్బింగ్ చిత్రాలకు సైతం తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు ధనుష్. ఇప్పటికే రజినీకాంత్, సూర్య, విశాల్‌, విజయ్ వంటి హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండగా.. ఈ లిస్ట్‌లో ధనుష్ కూడా చేరారు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here