Home తెలుగు News వంట suryapet: రూ.2 కోట్ల బుద్ధ విగ్రహం.. ‘స్వామి రారా’ సినిమా రేంజ్‌లో..! – 11 booked for smuggling old buddha statue in suryapet

suryapet: రూ.2 కోట్ల బుద్ధ విగ్రహం.. ‘స్వామి రారా’ సినిమా రేంజ్‌లో..! – 11 booked for smuggling old buddha statue in suryapet

0
suryapet: రూ.2 కోట్ల బుద్ధ విగ్రహం.. ‘స్వామి రారా’ సినిమా రేంజ్‌లో..! – 11 booked for smuggling old buddha statue in suryapet

[ad_1]

ప్రధానాంశాలు:

  • సూర్యాపేటలో చిక్కిన రెండు అంతర్ రాష్ట్ర ముఠాలు
  • పంచలోహ విగ్రహం క్రయవిక్రయాల జరుపుతుండగా అరెస్టు
  • తొలుత రూ.5 లక్షలకు విగ్రహాన్ని కొన్న వ్యక్తి

పురాతనమైన పంచలోహ విగ్రహాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన రెండు అంతర్ రాష్ట్ర ముఠాలను సూర్యాపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి విగ్రహం విక్రయానికి డీల్ చేస్తుండగా సీసీఎస్ పోలీసులతో కలసి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలిస్తే.. అప్పట్లో వచ్చిన ‘స్వామి రారా’ సినిమా గుర్తు రాకమానదు..

ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తన కార్యాలయంలో వెల్లడించారు.. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మిట్టపల్లి వేణుగోపాల్ ఐదేళ్ల కింద గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.5 లక్షలకు పురాతన గౌతమ బుద్ధుడు పంచలోహ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఆ విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే తమకు శుభం కలుగుతుందని, ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్మాడు.. అయితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో దానిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు.

దీంతో గత 3 నెలలుగా ఆ విగ్రహాన్ని ఇతరులకు అమ్మడానికి వెంకటనర్సింహారావు, పురుషోత్తం, నవీన్ బాబు, భాను ప్రకాశ్ అనే నలుగురు వ్యక్తులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. ఈక్రమంలోనే ఆ విగ్రహాన్ని కృష్ణా జిల్లాకు చెందిన యూనిస్ అనే వ్యక్తికి చెందిన ముఠా సభ్యులకు రూ.కోటికి అమ్మి వచ్చిన లాభాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఇటు యూనిస్ ముఠా కూడా ఆ విగ్రహాన్ని కొని రూ.2 కోట్లకు అమ్మితే డబ్బులు వస్తాయని భావించింది.

ఈ క్రమంలోనే కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో విక్రయిస్తే పోలీసులు గుర్తు పడతారని అనుమానించిన ఇరు ముఠాలు.. పక్క రాష్ట్రమైన తెలంగాణలోని సూర్యాపేటను సేప్ జోన్‌గా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం రెండు ముఠా సభ్యులు సూర్యాపేట పట్టణానికి వచ్చి కొత్త బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం గురించి మాట్లాడుకుంటుండగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తం అయిన సూర్యాపేట పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.

మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 26.3 కే‌జీల పురాతనమైన గౌతమ బుద్ధుడి పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకున్నారు.. అలాగే డబ్బులు లెక్కించే కౌంటింగ్ మెషీన్, వేయింగ్ మెషీన్, ఇన్నొవా కారు, 11 సెల్ ఫోన్లును తీసుకుని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇటు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సూర్యాపేట సీసీఎస్, పట్టణ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారందరికీ రివార్డ్స్ అందజేశారు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here