Home తెలుగు News ఆరోగ్యం test for heart attack, Heart Attack : ఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చట.. – this blood test can indicate your heart problem risk

test for heart attack, Heart Attack : ఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చట.. – this blood test can indicate your heart problem risk

0
test for heart attack, Heart Attack : ఈ టెస్ట్‌తో గుండెనొప్పి గురించి ముందే తెలుసుకోవచ్చట.. – this blood test can indicate your heart problem risk

రక్త పరీక్ష ద్వారా గుండె సమస్యల్ని గుర్తించొచ్చు. దానినే కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్ అని అంటారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

కార్డియో సి రియాక్టివ్(hs CRP) ప్రోటీన్ పరీక్ష అంటే..

కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్‌ని హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ రక్త పరీక్ష. నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో విజిటింగ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ బిక్రమ్ కేశరీ మొహంతి ప్రకారం, CRP, స్టాండర్డ్ CRP అనేది ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ అంటే శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రక్తంలో CRP స్థాయి పెరిగింది. hsCRP ప్రామాణిక CRP కంటే ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న మనిషిలో hsCRP స్థాయి ఎక్కువగా ఉంటే అది వ్యక్తికి గుండె ధమనులలో అడ్డంకులు, గుండెపోటు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం, స్ట్రోక్, ధమనుల్లో ఇబ్బంది వంటి వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అర్థం.

Also Read : Fatty Liver : వీటిని తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుందట..

ఫరిదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌లో కార్డియాలజీ, ప్రొఫెసర్ అండ్ HOD డాక్టర్ వివేక్ చతుర్వేది చెప్పినదాని ప్రకారం కార్డియో
సి రియాక్టివ్ ప్రోటీన్, హెచ్‌సిఆర్‌పి అనేది ఈ మధ్య వచ్చిన ఓ పరీక్ష. ఇది వివిధ పరిశోధన ప్యాకేజీలలో భాగంగా అందుబాటులో ఉంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్, ఒత్తిడి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరం ప్రతిచర్య. ఒక క్రిమి కాటు తర్వాత చర్మంపై ఎర్రటి మచ్చలు పడడం చూస్తాం. మంట కారణంగా ఈ సమస్య వస్తుంది. మంట అనేది కొద్దిసేపే ఉంటుంది. ఎక్కువ కాలం ఉన్నప్పుడు శరీరానికి మంచిది కాదు. గుండెలో ఎక్కువ కాలం మంట వల్ల గుండెపోటు, ఆకస్మిక, యాంజియోప్లాస్టి, బైపాస్ అవసరం మొదలైన సమస్యలతో ముడిపడి ఉంది. నిరంతరంగా అధిక హెచ్‌ఎస్‌సిఆర్‌పి ఉన్న వ్యక్తులకి గుండెజబ్బుల ప్రమాదం కనుక్కోండిందని డా.చతుర్వేది చెప్పారు.

దీంతో పాటు కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్, హెచ్‌ఎస్‌సిఆర్‌పి గుండె ఆరోగ్యానికి సంబందించిన జిగ్సా పజిల్‌లో ఓ భాగం మాత్రమే. ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాలు లేనప్పుడు అదిక స్థాయి హెచ్ఎస్‌సిఆర్‌పి ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది. అయినప్పటికీ, పెరిగిన హెచ్‌ఎస్‌సిఆర్‌పి సమక్షంలో ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాల వల్ల వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని చాలా నమ్మకం ఉంది. ఏదైనా ఇటీవలి ఇన్ఫెక్షన్స్ సీఆర్‌పి అండ్ హెచ్‌‌ఎస్‌సీఆర్‌పి అనేక వారాలపాటు ఎలివేటెడ్‌గా మారవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, ఇటీవలి ఇన్ఫెక్షన్లు ఉన్నట్లైతే, మీకు సీఆర్‌పీ పెరగడానికి కారణమయ్యే కొన్ని ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నట్లైతే దానిని అర్థం చేసుకోలేం. అందుకే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేసుకుని రిజల్ట్ ఎలా వచ్చిందనేది చూసుకోవాలి.

ఆరోగ్యంగా ఉన్నవారు ఫ్యూచర్‌లో ధమనుల్లో ఇబ్బందులు, గుండెపోటు, ఒక్కసారిగా గుండె ఆగిపోవడం, స్ట్రోక్ వంటి సమస్యలని ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్ డా. అనుపమ్ గోయెల్ ఇతర ప్రమాద కారకాలు, లిపిడ్ ప్యానెల్‌తో పాటు అధిక హెచ్‌ఎస్న‌సీఆర్‌పీ అనేది స్పష్టంగా ఉన్న వ్యక్తుల్లో సీవీడి ప్రమాదానికి గుర్తుగా ఉంటుంది. అదే లక్షణం కూడా అవ్వొచ్చు.hsCPR ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి తక్కువస్థాయి ఇన్‌ఫ్లమేషన్ ఉందని నిర్ధారించడానికి రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు చేయాలి. అధిక hsCPR అనేది మంట మార్కర్ మాత్రమే. గుండెజబ్బులని ప్రత్యేకంగా గుర్తించేది కాదు. ఈ విలువలు గుండె జబ్బుల కోసం మొత్తం లెక్కలో ఓ భాగం మాత్రమే. హై కొలెస్ట్రాల్, చక్కెర, రక్తపోటు, ధూమపానం, ఇతర సీవీడి ప్రమాద కారకాలతో పరిగణించాల్సిన అవసరం ఉంది.

heart attack causes

బీపి కూడా కారణమే..

ధూమపానం, ఊబకాయం, సరిలేని లైఫ్‌స్టైల్, హై కొలెస్ట్రాల్, సరిగ్గా లేని లైఫ్‌స్టైల్, హైబీపి, షుగర్, మెటబాలిక్ సిండ్రోమ్, అధికంగా రక్తంలో చక్కెర అసాధారణ లిపిడ్ స్థాయిలు, అదనపు కలయికతో సహా గుండె జబ్బులకి సంబంధించిన ఇతర ప్రమాద కారకాలతో ఎలివేటెడ్ సీఆర్‌పి స్థాయిలు దాదాపు ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉంటుంది.

40 తర్వాత రెగ్యులర్ స్క్రీనింగ్..

40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు సాధారణంగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఇందులో ప్రతి వ్యవస్థకు రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ, ఎకో కార్డియోగ్రఫీ, అవసరమైతే ట్రెడ్‌మిల్ పరీక్ష చేయించుకోవాలి. వ్యక్తి గుండె జబ్బులకు సంబందించిన హై రిస్క్ కేటగిరీలో ఉంటే వారికి కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, హై బీపి, షుగర్, దీర్ఘకాలిక ధూమపానం, అదిక మద్యపానం, ఊబకాయం ముఖ్యంగా గుండెజబ్బుల లక్షనాలు ఉంటే ఛాతీ నొప్పి, అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం వంటివి ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి.

Also Read : Illegal Affairs : పెళ్ళైన వారు ఎందుకు ఎఫైర్స్ పెట్టుకుంటారంటే..

డాక్టర్ వివేక్ మాట్లాడుతూ మీ గుండె ఆరోగ్యం కోసం ఎగ్జిక్యూటివ్ చెకప్, సాధారణ టెస్ట్‌లకు సంబంధించి చాలా వివాదాలే ఉన్నాయి. ప్రజలు భయపడుతున్నారు. జిమ్‌ చేస్తూ, సైకిల్ తొక్కేటప్పుడు గుండెనొప్పి వస్తూ కుప్పకూలిన వారి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. 30 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికీ కచ్చితంగా బీపీ చెక్ చేసుకోవడం, బరువు చూసుకోవడం, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్, అంతర్లీన గుండె ప్రమాదం గురించి తెలుసుకోవాలి. గ్లూకోజ్, కొలెస్ట్రాల్ కోసం సంవత్సరానికి 2 నుంచి 3 పరీక్షలు, రక్తపోటుని సంవత్సరానికి ఓ సారి తెలుసుకోవడం మంచిది.

కుటుంబంలో గుండె సమస్యలు, షుగర్ ఉన్నవారు, బరువు ఎక్కువగా ఉన్నవారు, మహమ్మారి సోకిన వారు.. ఇలాంటి వారంతా రెగ్యులర్‌గా చెకప్ చేసుకోవాల్సిందే. వీటిలో ప్రత్యేకమైన మూత్రపిండ, మూత్ర పరీక్షలు, ఎకో కార్డియోగ్రామ్ మొదలైనవి ఉండొచ్చు. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులలో ట్రెడ్ మిల్ టెస్ట్, కరోనరీ కాల్షియం స్కోర్ కూడా చేసుకోవాలి. ఎక్కువ వ్యాధి ప్రమాదం, విలక్షణమైన గుండె లక్షణాలతో ఎంపిక చేయబడిన కొన్ని సందర్భాల్లో, సీటి కరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..

మంచి జీవనశైలితో గుండెని కాపాడుకోవచ్చు. hsCPR తగ్గడం కూడా చూడొచ్చు. ఇది ధూమపానం, పొగాకుకు చురుగ్గా, నిష్క్రియాత్మకంగా బహిర్గతం చేయడాన్ని పూర్తిగా నివారించడం. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్‌కి దూరంగా ఉండడం, బరువుని మెంటెయిన్ చేయడం చేయాలి.

ముంబైలోని సింబయాసిస్ హాస్పిటల్ డైరెక్టర్ క్యాథ్‌లాబ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. అంకుర్ ఫాటర్ పేకర్ ప్రకారం గుండె ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోగల వివిధ నివారణ చర్యలను జీవనశైలి మార్పులు, ఔషధ ఆధారిత చికిత్సలుగా వర్గీకరించొచ్చు. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ధూమపానం దూరం చేసుకోవడం, మద్యపానం అలవాటుకి దూరంగా ఉండడం వంటివి పాటించాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి గుండెని ప్రభావితం చేసే రక్తపోటుని తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఔషధ ఆధారిత చికిత్సలలో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, హైబీపి, రక్తంలో హై గ్లూకోజ్ స్థాయిలకు ట్రీట్‌మెంట్‌తో పాటుగా సీవీడి ట్రీట్‌మెంట్ ఉన్నాయి.

Also Read : Healthy Breakfast : ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే బీపి కంట్రోల్‌లో ఉంటుందట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here