Home తెలుగు News ఆరోగ్యం vitamin d deficiency, Vitamin D : డి విటమిన్ పెరగాలంటే ఇలా చేయాల్సిందే.. – what are the symptoms of vitamin d deficiency know here all

vitamin d deficiency, Vitamin D : డి విటమిన్ పెరగాలంటే ఇలా చేయాల్సిందే.. – what are the symptoms of vitamin d deficiency know here all

0
vitamin d deficiency, Vitamin D : డి విటమిన్ పెరగాలంటే ఇలా చేయాల్సిందే.. – what are the symptoms of vitamin d deficiency know here all

Vitamin D : శరీరంలో విటమిన్ డి లోపం ఎముకలని ప్రభావితం చేస్తుంది. ఎముకల సమస్యలకి కారణమవుతుంది. శరీర ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. అనేక హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. స్వయం ప్రతి రక్షక సమస్యలకి కారణమవుతుంది. నరాల వ్యాధులని సూచిస్తుంది. ఇన్ఫెక్షన్లకి కారణమవుతుంది. ఇది గర్భిణీలలో సమస్యలకి దారి తీస్తుంది. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు వంటి క్యాన్సర్స్‌కి కూడా కారణం.

Also Read : Kidney Problems : నోటి దుర్వాసన వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లేనా..

తరచుగా ఆరోగ్య సమస్యలు కామన్ అయినప్పటికీ, విటమిన్ డి లేకపోవడంతో దాని సంబంధం చాలా మందికి తెలియదు. విటమిన్ డి ఇమ్యూనిటీని శక్తిని బలపరుస్తుంది. కాబట్టి, దాని లోపం వ్యాధికారక క్రిములతో పోరాడే శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా, వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. మీరు మీ విటమిన్ డి స్థాయిలను ఎందుకు చెక్ చేయాలి అనేదానికి రెగ్యులర్‌గా అలసట మరో లక్షణం. మీరు ఏ వివరణ లేకుండా అన్ని సమయాలలో అలసిపోతే విటమిన్ డి లోపం కూడా కారణం కావొచ్చు. ఇది మీ శక్తి స్థాయిని ప్రభావిం చేస్తుంద. కొత్త పని చేయడానికి మీ మానసిక స్థితి కూడా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ అనేది విటమిన్ డి లేకపోవడానికి మరో లక్షణం. రెగ్యులర్‌గా అలసట మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ ఈ వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం తక్కువ విటమిన్ డి జుట్టుని ఎఫెక్ట్ చేస్తుంది. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ఎన్నో మందులు, షాంపూలను వాడినప్పటికీ జుట్టు రాలుతూనే ఉంటుంది. అందుకే ముందుగా విటమిన్ డి టెస్ట్ చేసుకోండి.

Also Read : Statins : ఈ మందులని సడెన్‌గా ఆపేస్తే గుండెనొప్పులు వస్తాయట.. జాగ్రత్త..

vitamin d rich foods

విటమిన్ డి రిచ్ ఫుడ్స్

లక్షణాలు ఏంటంటే..

  • సరిపడా విటమిన్ డి లేని వ్యక్తుల్లో చర్మంపై దద్దుర్లు, మొటిమలు కూడా సాధారణం. ఈ వ్యక్తులలో చర్మంపై త్వరగా ముడతలు వస్తాయి.
  • విటమిన్ డి లేకపోతే ఎముకలు బలహీనంగా మారడం, బోలు ఎముకల వ్యాధి, ఎముకల నొప్పి, కండరాలు మెలి తిప్పడం, కండరాల బలహీనత విపరీతమైన కండరాల నొప్పులు వస్తాయి.
  • ఎండకి తక్కువగా ఉండేవారు విటమిన్ డి లోపానికి గురవుతారు. విటమిన్ డి తక్కువగా ఉన్న ఆహారాలు మిల్క్ అలర్జీ, లాక్టోస్ అసహనం ఉన్నవారిలో, ఓవో వెజిటేరియన్, శాకాహారం తీసుకునేవారిలో ఎక్కువగా కనిపిస్తాయని ఓ నివేదిక పేర్కొంది. తల్లిపాలు తాగే శిశువులు, వృద్ధులు, నల్లటి చర్మం ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది.
  • హార్వర్డ్ నివేదిక ప్రకారం ఊబకాయం ఉన్న వ్యక్తులు రక్తంలో విటమిన్ డి స్థాయిలను తక్కువగా కలిగి ఉంటారు. విటమిన్ డి అదనపు కొవ్వు కణజాలాలలో పేరుకుపోతంది. కానీ, అవసరమైనప్పుడు శరీరానికి సులభంగా అందుబాటులో ఉండదు. విటమిన్ డిని అధిక మోతాదులో తీసుకోవడం అవసరం కావొచ్చు. కావాల్సిన రక్త స్థాయిన సాధించండి. దీనికి విరుద్ధంగా, ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గినప్పుడు విటమిన్ డి రక్తస్థాయిలు పెరుగుతాయి.
  • విటమిన్ డి సరైన మొత్తం 10-20 మైక్రోగ్రాములు. అయితే, కొంతమందికి ఇది పెరగొచ్చు. కానీ, 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకోకపోవడం మంచిది.
  • మీరు ఏదైనా సప్లిమెంట్స్‌ని తీసుకునే ముందు డాక్టర్స్‌ని కలవడం మంచిది.

Biryani Rice : ఈ ఆకు వేసి అన్నం వండితే బిర్యానీలా ఉంటుందట..
ఒకవైపు మీరు మీ శరీరాన్ని ఆకలిగా ఉండనివ్వకూడదు. మరోవైపు, మీరు దానిని ఎక్కువగా తీసుకోకూడదు. విటమిన్ డి టాక్సిసిటీ అనేది శరీరంలో అదనపు విటమిన్ డి ఉన్నప్పుడు ఎక్కువగా విటమిన్ డి సప్లిమెంట్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది.

విటమిన్ డి విషపూరిత లక్షణాలు అనోరెక్సియా, బరువు తగ్గడం, సక్రమంగా గుండె కొట్టుకోవడం, శరీరంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల రక్తనాళాలు గట్టిపడటం ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here