Home తెలుగు News ఆరోగ్యం World Diabetes Day: షుగర్‌ పేషెంట్స్‌.. ఈ తప్పులు చేస్తే చాలా ప్రమాదం – know the common mistakes by diabetic patients on world diabetic day

World Diabetes Day: షుగర్‌ పేషెంట్స్‌.. ఈ తప్పులు చేస్తే చాలా ప్రమాదం – know the common mistakes by diabetic patients on world diabetic day

0
World Diabetes Day: షుగర్‌ పేషెంట్స్‌.. ఈ తప్పులు చేస్తే చాలా ప్రమాదం – know the common mistakes by diabetic patients on world diabetic day

World Diabetes Day: డయాబెటిస్‌ వస్తే.. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్ప.. పూర్తిగా తగ్గించుకోలేం. మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం. షుగర్‌ పేషెంట్స్‌కు వయసుతో సంబంధంలేదు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ తీపి జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిక్‌ పేషెంట్స్‌.. రక్తంలో చక్కెర స్థాయిలను దీర్ఘకాలం కంట్రోల్‌లో ఉంచుకోకపోతే, అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, చూపు కోల్పోపోవటం, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌ వారి డైలీలైఫ్‌లో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వాళ్లు చేసే‌ తప్పులు ఏమిటో తెలుసుకుని.. జాగ్రత్తపడటం చాలా ముఖ్యం. నవంబర్‌ 14న ప్రపంచ డయాబెటిస్‌ డే నిర్వహస్తారు. షుగర్‌ వ్యాధిపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉదేశం. ఈ సందర్భంగా, షుగర్‌ పేషెంట్స్‌ చేసే మిస్టేక్స్‌ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

diabetes fb

diabetes-fb

నీళ్లు తక్కువగా తాగడం..

చాలామంది నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలం.. క్లైమేట్‌ చల్లగా ఉండి నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటారు. దీంతో.. రోజు తాగాల్సిన నీటి కంటే.. తక్కువగా వాటర్‌ తాగుతూ ఉంటారు. దీని వల్ల డీహైడ్రేషన్‌‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతాయి. షుగర్‌ పేషెంట్స్‌ రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం మంచిది. తగినన్ని నీళ్లు తాగితే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

ఆర్టిఫిషియల్‌ షుగర్‌..

చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌.. వారి డ్రింక్స్‌లో, టీ, కాఫీలో ఆర్టిఫిషియల్‌ షుగర్‌ వేసుకుంటూ ఉంటారు. ఆర్టిఫిషియల్‌ షుగర్‌ తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని అనుకుంటారు. కానీ, ఇవి ఎక్కువకాలం తీసుకుంటే.. శరీరంలోని ఇన్సులిన్‌ హార్మోన్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. దీంతో.. రక్తంలో చక్కెర స్థాయుల్లో అప్‌ & డౌన్స్‌ ఉంటాయి. షుగర్‌ పేషెంట్స్‌.. ఆర్టిఫిషియల్‌ షుగర్‌ వాడకపోవడమే మంచిది. వీటికి బదులు.. స్టీవియా వాడితే

బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తున్నారా..?

కొంతమంది వర్క్‌ బిజీలో బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేస్తూ ఉంటారు. వీళ్లు టిఫిన్‌ మానేసి.. డైరెక్ట్‌గా లంచ్‌ చేస్తుంటారు. దీని వల్ల రక్తంలో షుగర్‌ లెవల్‌ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌ కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కెఫిన్‌ డ్రింక్స్‌ తాగుతున్నారా..?

చాలా మందికి కాఫీ/టీ తాగనిదే.. డే స్టార్ట్‌ అవ్వదు. కానీ వీటిలో ఉండే కెఫిన్‌ కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు ఎఫెక్ట్‌ అయ్యే ప్రమాదం ఉంది. డయాబెటిక్‌ పేషెంట్స్‌.. కాఫీ, టీ, కెఫిన్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆల్కహాల్‌..

అల్కహాల్‌ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. వైన్‌లో చక్కెర ఉంటుంది. వోడ్కా , క్రాన్బెర్రీస్ 7.5 టీస్పూన్ల చక్కెర ఉంటుంది. ఆల్కహాల్ తాగుతూ ఉంటే.. మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. షుగర్‌ పేషెంట్స్‌ బరువు కంట్రోల్‌లో ఉండాలి.

వైట్‌ రైస్‌..

మనం సాధారణంగా తెల్ల అన్నం ఎక్కువగా తింటాం. దీనిలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిది.

కొవ్వు తియ్యని పాలు..

హోల్ మిల్కులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాలను మరింత పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు హోల్ మిల్క్‌తో పాటు పాలకోవ, మైసూర్‌పాక్ వంటి డైరీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here